తాను పూర్తి శాకాహారి (వెజ్) నని, కానీ తనకు నాన్ వెజ్ (మాంసాహార) పిజ్జా పంపారంటూ అమెరికన్ పిజ్జా ఔట్ లెట్ ను ఓ మహిళ కోర్టుకు లాగింది. ఈ మేరకు వినియోగదారుల వివాద పరిష్కార కోర్టుకెక్కింది. ఈ పిజ్జా రెస్టారెంట్ తనను ఛీట్ చేసిందని, ఇందుకు పరిహారంగా తనకు కోటి రూపాయల పరిహారం చెల్లించేలా ఆదేశించాలని ఆమె కోరింది. దీపాలీ త్యాగి అనే ఈ మహిళ ఇలా కోర్టుకెక్కడం సంచలనం కలిగించింది. నా కుటుంబం పూర్తిగా శాకాహార కుటుంబం. మేము స్వచ్ఛమైన సంప్రదాయాలను, ఆచారాలను..మత విశ్వాసాలను పాటిస్తాం.. ప్రబోధాలు కూడా చేస్తుంటాం..అలాంటిది శాకాహార పిజ్జా పంపాలని కోరితే నాన్ వెజ్ పిజ్జా పంపారని ఈమె తన పిటిషన్ లో పేర్కొంది. 2019 మార్చి 21 న ఈమె యూపీ..ఘజియాబాద్ లోని తన ఇంటి నుంచి వెజ్ పిజ్జాకు ఆర్డర్ ఇచ్చిందట .. ఆరోజు హొలీ పండుగ కావడంతో తన పిల్లలంతా ఆ పండుగ సంబరాలు జరుపుకుని ఆకలితో ఉన్నారని ఈమె తెలిపింది. అరగంట లోగా ఈ డిష్ పంపుతామని అమెరికన్ ఔట్ లెట్ హామీ ఇఛ్చినా ఆలస్యంగా డెలివరీ అయిందని, కానీ తమనుతాము సర్ది చెప్పుకుని .. దాని రుచి చూడగానే అది నాన్ వెజ్ పిజ్జా అని తెలిసిపోయిందని దీపాలీ వెల్లడించింది. దాని లోపల పుట్టగొడుగుల బదులు మాంసం ముక్కలు కనిపించినట్టు ఆమె పేర్కొంది.
వెంటనే కస్టమర్ కేర్ సెంటర్ కు ఫోన్ చేశామని, కానీ అక్కడి నుంచి మొదట నిర్లక్ష్య సమాధానం వచ్చినట్టు ఆమె తెలిపింది. అదే ఏడాది మార్చి 26 న తనను ఈ ఔట్ లెట్ మేనేజర్ నని చెప్పుకున్న ఓ వ్యక్తి..మీ కుటుంబానికి ఉచితంగా వెజ్ పిజ్జా పంపుతామని చెప్పాడని, కానీ తనకు కలిగిన మానసిక క్షోభకు, తనను ఒక రకంగా మోసగించినందుకు తనకు కోటి రూపాయల పరిహారం కోరుతున్నానని దీపాలీ తన పిటిషన్ లో వెల్లడించింది. ఢిల్లీలోని జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ ఈ మహిళ ఫిర్యాదుపై స్పందించాలని సంబంధిత పిజ్జా సంస్థను కోరింది. దీనిపై ఈ నెల 17 న విచారణ జరపాలని నిర్ణయించింది.
మరిన్ని చదవండి ఇక్కడ :
Love Proposal: ఆమె మోకరిల్లింది.. అతను దాసోహమయ్యాడు.. కొన్ని తియ్యనైన కన్నీళ్లు.. వీడియో
KTR: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై గళమెత్తిన కేటీఆర్, ఏపీ.. దేశంలో భాగం కాదా..! అని వ్యాఖ్య ( వీడియో )