Russia-Ukraine War: ఉక్రెయిన్ విషయంలో పుతిన్‌కు పూనకమెందుకు? ఇంతకీ రష్యా డిమాండ్లు ఏంటి?

ఇంతకీ పుతిన్‌కు ఏం కావాలి? దేనికోసం ఈ బీభత్సం సృష్టిస్తున్నారు? టార్గెట్‌ ఉక్రెయిన్‌ మాత్రమేనా? ఇంకేమైనా ఉందా? ఇది ఉక్రెయిన్‌తోనే ఆగుతుందా? అంతర్జాతీయంగా మరిన్ని తేనెతుట్టెల్ని కదుపుతుందా? తైవాన్‌ పరిస్థితి కూడా ఉక్రెయిన్‌లా మారుతుందా? కర్ణుడి చావుకి లక్ష కారణాలన్నట్టు..

Russia-Ukraine War: ఉక్రెయిన్ విషయంలో పుతిన్‌కు పూనకమెందుకు? ఇంతకీ రష్యా డిమాండ్లు ఏంటి?
President Vladimir Putin
Follow us

|

Updated on: Feb 24, 2022 | 7:07 PM

ఉక్రెయిన్‌(Ukraine) విషయంలో పుతిన్‌కు(Vladimir Putin) పూనకమొచ్చింది. ఉక్రెయిన్‌పై ఉరుములా విరుచుకుపడుతున్నారు. అగ్రరాజ్యం అమెరికానే(America) కాదు… మిత్రదేశాలతో పాటు.. ఎవరేం చెప్పినా వినే పరిస్థితి కనిపించడం లేదు. ఈవిషయంలో ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమంటున్నారు. ఈ వ్యవహారంలో ఎవరైనా తలదూర్చితే.. తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ పుతిన్‌కు ఏం కావాలి? దేనికోసం ఈ బీభత్సం సృష్టిస్తున్నారు? టార్గెట్‌ ఉక్రెయిన్‌ మాత్రమేనా? ఇంకేమైనా ఉందా? ఇది ఉక్రెయిన్‌తోనే ఆగుతుందా? అంతర్జాతీయంగా మరిన్ని తేనెతుట్టెల్ని కదుపుతుందా? తైవాన్‌ పరిస్థితి కూడా ఉక్రెయిన్‌లా మారుతుందా? కర్ణుడి చావుకి లక్ష కారణాలన్నట్టు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి చాలా కారణాలున్నాయి. యూరప్ సంస్థలైన నాటో, ఈయూల వైపు ఉక్రెయిన్ ఉండటాన్ని రష్యా మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. అసలు, ఉక్రెయిన్‌ వేరేదేశం కాదనీ.. రష్యాలో భాగమేనన్నది మొదట్నుంచీ పుతిన్‌ చేస్తున్న వాదన.

అలాంటి ఉక్రెయిన్ ఎప్పుడూ పశ్చిమ దేశాల చేతుల్లో కీలుబొమ్మగానే ఉందనీ.. అది ఎప్పుడూ స్వతంత్ర దేశంగా లేనేలేదని పుతిన్ చెబుతున్నారు. 30 దేశాల కూటమిగా ఉన్న నాటోలో ఉక్రెయిన్‌ చేరదనే హామీని.. పాశ్చాత్య ప్రపంచం ఇవ్వాలని పుతిన్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అటు రష్యాతోనూ, ఇటు యూరోపియన్ యూనియన్‌తోనూ సరిహద్దును పంచుకుంటోంది. ఒకప్పటి సోవియట్ రిపబ్లిక్‌లో భాగమైన ఉక్రెయిన్‌కు.. రష్యా సామాజిక, సాంస్కృతిక జీవనంతో దగ్గరి అనుబంధం ఉంది. ఆ దేశంలో రష్యన్ భాషను మాట్లాడే వాళ్లు ఎక్కువగా ఉంటారు. అయితే, 2014లో రష్యా దాడి చేసినప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

ప్రస్తుతం రష్యా దృష్టంతా ఉక్రెయిన్‌ను తమలో కలిపేసుకోవడంపైనే ఉన్నట్టు తెలుస్తోంది. దీనికోసం పథకం ప్రకారమే.. రష్యాసైన్యం ఉక్రెయిన్‌పై ముప్పేట దాడి చేస్తోంది. అమెరికా హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా … మొదట రాజధాని కీవ్‌ను టార్గెట్‌ చేసింది. అన్ని వైపులా దాడి ముమ్మరం చేసి… ఉక్రెయిన్‌లో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని తొలగించాలన్నది పుతిన్‌ లక్ష్యంగా కనిపిస్తోంది. తమ లక్ష్యం సాధారణ పౌరులు కాదనీ… ఉక్రెయిన్ సైన్యస్థావరాలేనని తేల్చి చెబుతోంది రష్యా.

అంతేకాదు, ఉక్రెయిన్‌ అణ్వాయుధాలను కలిగి ఉండటాన్ని ఏమాత్రం సహించేది లేదంటోంది. అది ఎప్పటికైనా తమకు ప్రమాదమేనన్నది పుతిన్‌ ఆందోళన. అందుకే ఉక్రెయిన్‌పై ఉప్పెనలా విరుచుకుపడుతున్నారనేది ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్న మాట. పశ్చిమ దేశాలు కూడా ఉక్రెయిన్‌కు సైనిక బలగాలను పంపించే ఉద్దేశాలేవీ తమకు లేవని తేల్చి చెప్పేశాయి. ఇదే అదునుగా రష్యా.. నాటోతో తన బంధాన్ని తిరిగి పటిష్టం చేసుకునేందుకు కొన్ని డిమాండ్లను ప్రధానంగా ముందుకు తీసుకొచ్చింది. వాటిలో ఒకటి, మరింత విస్తరించేది లేదని నాటో చట్టబద్ధంగా అంగీకరించడం.

అందులో ముఖ్యంగా.. ఉక్రెయిన్ ఎన్నటికీ నాటో సభ్య దేశం కాకూడదన్నది రష్యా డిమాండ్‌. రష్యా వెనక్కి, ముందుకు వెళ్లడం అనేదేమీ ఉండదనీ.. ఎవరేం చేస్తున్నా చేతులు ముడుచుకుని కూర్చోలేమనీ హెచ్చరించడంలో పుతిన్‌ ఉద్దేశం అదే. అంతేకాదు, వేర్పాటువాద శక్తుల్ని ఉక్రెయిన్‌ ప్రోత్సహిస్తోందని పుతిన్‌ ఆరోపిస్తున్నారు.

ఉక్రెయిన్‌ స్వాతంత్ర్యాన్ని, సార్వభౌమాధికారాలను గుర్తిస్తూ రష్యా 1994లో ఒక ఒప్పందం మీద సంతకాలు చేసింది. కానీ, గతేడాది పుతిన్ ఒక సుదీర్ఘమైన లేఖలో… రష్యన్లు, ఉక్రెయిన్లు ఒకే దేశమని, ఈనాటి ఉక్రెయిన్ పూర్తిగా కమ్యూనిస్టు రష్యా ఏర్పాటు చేసిందేనని చెప్పారు. సోవియట్ యూనియన్ 1991లో ముక్కలు కావడాన్ని పుతిన్ “చరిత్రాత్మక రష్యా విచ్ఛిన్నం”గా చూస్తున్నారు.

ఉక్రెయిన్ కనుక నాటోలో చేరితే.. ఆ కూటమి మళ్లీ క్రిమియాను లాక్కునేందుకు ప్రయత్నిస్తుందని పుతిన్ భావిస్తున్నారు. తమ దేశసరిహద్దు ప్రాంతాల్లో నాటో.. సాయుధ దళాలను మోహరించకూడదన్నది కూడా రష్యా డిమాండ్లలో కీలకమైంది. అంతేకాకుండా, 1997 తరువాత ఆ కూటమిలో చేరిన సభ్య దేశాల నుంచి కూడా సైనిక శక్తిని, పాటవాన్ని ఉపసంహరించుకోవాలని కూడా పుతిన్ డిమాండ్ చేస్తున్నారు.

అంటే, మధ్య యూరప్, తూర్పు యూరప్, బాల్టిక్స్‌లో నాటో ఉండకూడదు. ఒక విధంగా నాటో 1997 పూర్వ స్థితికి వెళ్లాలని రష్యా కోరుకుంటోంది. అయితే, నాటో మాత్రం.. రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడుతుండటం విశేషం. నిజానికి ఇదొక రక్షణాత్మక కూటమి. ఎవరైనా తమ కూటమిలో చేరవచ్చన్నది దాని విధానం. అందులో మార్పు ఏమీ ఉండదని… నాటోలని 30 సభ్య దేశాలు నిక్కచ్చిగా చెబుతుంటాయి.

అందుకే, నాటోలో చేరాలని ఉక్రెయిన్‌ ఉత్సాహం చూపిస్తోంది… ఇదే అంశం పుతిన్‌కు కోపం తెప్పించింది. ఎందుకంటే, ఒక్కసారి నాటోలో సభ్యత్వం తీసుకుంటే.. ఆ దేశాలు ఏవైనా సరే తమ సభ్యత్వాన్ని రద్దు చేసుకునే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. అయితే, పశ్చిమ దేశాలు 1990లోనే నాటోను తూర్పు దిశగా ఒక్క అంగుళం కూడా విస్తరించనివ్వబోమని మాట ఇచ్చాయని పుతిన్ అంటున్నారు. కానీ, అది విస్తరించడంతో.. రష్యా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

అంతేకాదు, ఈ వ్యవహారంలో ఇంతదాకా వచ్చి.. ఇప్పుడు వెనకడుగు వేస్తే మొదటికే మోసం వస్తుందేమోనన్న ఆలోచనలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఉన్నారు. అంతేకాదు, తమ దేశాన్ని ప్రపంచం ముందు మరోసారి పటిష్టమైనదిగా చూపించుకునేందుకు ఇదే అదునుగా పుతిన్‌ భావిస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇతర దేశాలు కలుగజేసుకోవద్దంటూ పుతిన్‌ హెచ్చరించడం అందులో భాగమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఉక్రెయిన్‌పై రష్యాదాడి.. అంతర్జాతీయంగా తేనెతుట్టెలా ఉన్న మరో అంశాన్ని కదిపింది. ఉక్రెయిన్‌ విషయంలో రష్యా చేసిందే… రేపు తైవాన్‌ విషయంలో చైనా చేస్తుందనే చర్చ మొదలైంది. అయితే, తైవాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించడానికి ఎప్పుడూ ఇష్టపడని చైనా.. దాన్ని ఉక్రెయిన్‌తో పోల్చడాన్ని ఖండించింది. రెండింటికీ చాలా తేడా ఉందని, తైవాన్‌ ఎప్పటికీ చైనాలో అంతర్భాగమేనని స్పష్టం చేసింది.

ఉక్రెయిన్‌ తరహాలో తైవాన్‌పైనా కొన్ని విదేశీ శక్తులు కన్నేసి ఉంచాయన్న ఆ దేశ అధ్యక్షుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఉక్రెయిన్‌లో పరిస్థితులు తారుమారు చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయనీ… ఇదే తరహాలో తమనూ దెబ్బతీసేందుకు విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయంటూ.. తైవాన్‌ అధ్యక్షుడు మాట్లాడటం కలకలం రేపింది. ఆ వ్యాఖ్యలు కచ్చితంగా చైనాను ఉద్దేశించినవేనని చెప్పకనే చెప్పాయి. దీంతో, చైనా తీవ్రంగా స్పందించింది. తైవాన్‌ ఎప్పటికీ ఉక్రెయిన్‌ కాబోదనీ… అదెప్పటికీ చైనాలో అంతర్భాగమేనని స్పష్టం చేసింది చైనా. ఇది చరిత్ర చెబుతున్న నిజమనీ… కనీస ప్రాథమిక అవగాహన లేనివారే ఉక్రెయిన్‌తో తైవాన్‌ను పోలుస్తారని మండిపడింది. దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశాల్లో రాజీ పడబోమని, అవసరమైతే సైన్యాన్ని వినియోగించైనా అంతర్భాగం చేసుకోవడానికి వెనుకాడబోమనీ చైనా హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి: Russia-Ukraine War: ప్లీజ్‌.. ప్లీజ్‌.. మోదీజీ మీరు జోక్యం చేసుకోండి.. పుతిన్ మీ మాట వింటారు.. భారత్‌ను వేడుకున్న ఉక్రెయిన్‌ రాయబారి

Russia Ukraine War Live: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం వివరాల కోసం ఇక్కడ చూడండి..

ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
బాలీవుడ్‌లోకి అడుగుపెట్టగానే రెచ్చిపోయిందిగా
‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..
‘బీజేపీ విశాల జన సభ’కు హాజరైన అమిత్ షా.. 10ఏళ్ల పాలనపై ప్రసంగం..
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
టాస్ గెలిచిన బెంగళూరు.. భారీ స్కోర్ మిస్..
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
ఆహారంలో సూపర్​ఫుడ్స్​ తీసుకోండి ఇల.. బంగారంలాంటి ఆరోగ్యం మీ సొంతం
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!