WHO Omicron: ఆ పేరు చెప్పి అతి చేయొద్దు.. ఒమిక్రాన్‌పై కీలక కామెంట్స్‌ చేసిన WHO ప్రతినిధులు..!

|

Dec 02, 2021 | 5:44 AM

WHO Omicron: ఒమిక్రాన్‌పై కీలక కామెంట్స్‌ చేశారు WHO ప్రతినిధులు. ప్రజలను కాపాడటానికి ఆంక్షలు పెట్టొచ్చు కానీ, ఆ పేరు చెప్పి అతి చేయొద్దన్నారు వైద్య నిపుణులు.

WHO Omicron: ఆ పేరు చెప్పి అతి చేయొద్దు.. ఒమిక్రాన్‌పై కీలక కామెంట్స్‌ చేసిన WHO ప్రతినిధులు..!
Who
Follow us on

WHO Omicron: ఒమిక్రాన్‌పై కీలక కామెంట్స్‌ చేశారు WHO ప్రతినిధులు. ప్రజలను కాపాడటానికి ఆంక్షలు పెట్టొచ్చు కానీ, ఆ పేరు చెప్పి అతి చేయొద్దన్నారు వైద్య నిపుణులు. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌.. ఇప్పటికే 14 దేశాలకు విస్తరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో దాదాపు అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. వైరస్‌ కట్టడిలో భాగంగా పలు దేశాలు దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. మరికొన్ని దేశాలు కొవిడ్‌ కట్టడి చర్యలను ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌పై అతిగా స్పందించొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ దేశాలకు సూచించారు. కఠిన ఆంక్షలు అవసరం లేదన్నారు టెడ్రోస్. ‘‘ప్రజలను కాపాడుకోవాలని దేశాలు భావించడాన్ని అర్థం చేసుకున్నాం. కానీ, ఒమిక్రాన్‌ వేరియంట్‌పై పూర్తి అవగాహన రాలేదు.’’ అని అన్నారు అథనామ్.

వేరియంట్‌ తీవ్రత ఎంత? ప్రస్తుత కొవిడ్‌ వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌ను సమర్థంగా ఎదుర్కోగలవా? అనే ప్రశ్నలకు సమాధానం అన్వేషించాల్సి ఉందన్నారాయన. ఒమిక్రాన్‌ వ్యాప్తి వేగంగా ఉన్నా ఇప్పటి వరకు మరణాలు నమోదు కాలేదని, అయినా, అప్పుడే కొన్ని దేశాలు వైరస్‌ కట్టడికి అనవసరంగా కఠిన ఆంక్షలు విధిస్తున్నాయని తెలిపింది WHO. వీటి వల్ల వైరస్‌ను నియంత్రించలేమని, పైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఈ చర్యల వల్ల పరిస్థితులు మరింత దిగజారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు టెడ్రోస్‌. ఒమిక్రాన్‌ గురించి పూర్తిగా తెలియక ముందే దక్షిణాఫ్రికాపై ఆంక్షలు విధించవద్దని విజ్ఞప్తి చేశారు టెడ్రోస్. ఒమిక్రాన్‌పై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్న దక్షిణాఫ్రికా, బోట్సావానా దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. సరైన పని చేస్తున్నందుకు ఆ దేశాలను ఇతర దేశాలు శిక్షిస్తుండటం ఆందోళనకరమన్నారు టెడ్రోస్‌. కాగా, ఒమిక్రాన్‌ వెలుగులోకి వచ్చిన వెంటనే బ్రిటన్, అమెరికా వంటి దేశాలు స్పందించి, ఆంక్షల దిశగా అడుగులేశాయి. ఆ దిశలో మరికొన్ని కీలక దేశాలు కూడా ఉన్నాయి.

Also read:

Omicron Spread: వేగంగా వ్యాపిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్..మరో రెండు దేశాల్లో కలకలం..ఒమిక్రాన్ లేటెస్ట్‌ అప్‌డేట్స్

Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్ ఆకలితో పాకిస్తాన్ వ్యాపారం.. భారత్ చేస్తున్న సహాయాన్ని తనదిగా చెప్పుకునే ప్రయాస!

Social Media: సోషల్ మీడియాలో మీ ఎకౌంట్ తీసేయాలని అనుకుంటున్నారా? ఇలా చేయండి..