WHO Chief: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్.. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని పిలుపు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ క‌రోనా టీకా తీసుకున్నారు. కరోనావైరస్‌కు టీకా తీసుకున్నట్లు ఆయన ట్విట్టర్ వేదిక ద్వారా గురువారం ప్రకటించారు.

WHO Chief: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్.. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని పిలుపు
Who Director General Vaccinated

Updated on: May 13, 2021 | 2:52 PM

WHO Director-General vaccinated: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ క‌రోనా టీకా తీసుకున్నారు. కరోనావైరస్‌కు టీకా తీసుకున్నట్లు ఆయన ట్విట్టర్ వేదిక ద్వారా గురువారం ప్రకటించారు. ప్రజ‌లంతా వారి వారి ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న టీకా కేంద్రాల వద్ద తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని ప్రాణాల‌ను కాల‌పాడుకోవాల‌ని టెడ్రోస్ పిలుపునిచ్చారు.

బుధ‌వారం సాయంత్రం జెనీవాలోని యూనివ‌ర్సిటీ హాస్పిట‌ల్‌లో టెడ్రోస్ క‌రోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. అయితే, ఏ బ్రాండ్ వ్యాక్సిన్ తీసుకున్నారనేది మాత్రం ఆయ‌న వెల్లడించ‌లేదు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఫైజ‌ర్‌, మోడ‌ర్నా వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త‌న పేరును రిజిస్టర్ చేసుకున్న 56 ఏళ్ల టెడ్రోస్‌.. త‌న వంతు వ‌చ్చింద‌ని స‌మాచారం ఇవ్వడంతో వెళ్లి టీకా వేయించుకున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.


“ఈ రోజు కొవిడ్‌-19 కు టీకా వేసుకునే నా వంతు వ‌చ్చింది. టీకాలు ప్రాణాలను కాపాడతాయి. వాటిని అన్ని ప్రాంతాలకు తీసుకురావడం చాలా క్లిష్టమైనది. నాలాగా మీరంతా టీకాలు అందుబాటులో ఉన్న దేశంలో నివసిస్తుంటే.. దయచేసి మీ వంతు వ‌చ్చినప్పుడు టీకాలు తీసుకోండి” అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Read Also….  Corona Super Spreader: 33 మందికి క‌రోనా అంటించిన మహిళ .. ఏం జ‌రిగిందంటే…!