
EB-1 అనేది ఒక ప్రత్యేకమైన వీసా వర్గం. దీనినే ఐన్‌స్టీన్‌ను ఎంప్లాయిమెంట్ బేస్డ్ ఇమిగ్రేషన్ (EB-1)వీసా అని అంటారు. అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ పోర్టల్ EB-1 వీసా వివరాల ప్రకారం.. సైన్స్, ఆర్ట్స్, ఎడ్యుకేషన్, బిజినెస్, అథ్లెట్ వంటి రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిపుణులైన వారికి మాత్రమే ఈ వీసా జారీ చేయబడుతుంది. ఇది ఇతర వీసా రకాల నుండి చాలా భిన్నంగా ఉంటుంది, ఎందుకంటే EB-1Aకు దరఖాస్తు చేసుకునేవారికి యజమాని స్పాన్సర్ అవసరం లేకుండా యునైటెడ్ స్టేట్స్‌లో శాశ్వత నివాసం కోసం స్వీయ-పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది.
మూడు రెట్లు పెరిగిన డిమాండ్
యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) డేటా ప్రకారం, గత నాలుగు సంవత్సరాలలో EB-1 వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. అంటే అమెరికాకు వలస వెళ్లాలనుకునే వారు ఎక్కువగా ఈ వీసాపై ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. 2021లో ఈ వీసా కోసం కేవలం 2,500 దరఖాస్తులు రాగా.. గత ఏప్రిల్, జూన్ నెల మధ్య మాత్రమే ఈ ధరఖాస్తుల సంఖ్య 7,500కు చేరింది. కానీ దరఖాస్తుల ఆమోదం మాత్రం 67% నుండి దాదాపు 50%కి తగింది. డిమాండ్ పెరగడంతో దరఖాస్తుల పరీశీలనను మరింత కఠినతరం చేస్తున్నట్టు ఇది తెలియజేస్తుంది.
EB-1 వీసాను ఎవరు పొందవచ్చు?
ఐన్‌స్టీన్ వీసా’ అనేది అనధికారిక పదం దీనిని US ప్రభుత్వం ఉపయోగించదు. USCIS ప్రకారం.. ఒక దరఖాస్తుదారుడు ఈ వీసాను పొందాలంటే ఈ క్రింది వర్గాలకు చెంది ఉండాలి
ఇది యునైటెడ్ స్టేట్స్‌లో శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) కోసం EB-1 కేటగిరీలోని ఒక ఉపవర్గం. అర్హత పొందడానికి రెండు మార్గాలు ఉన్నాయి: ఒకసారి సాధించిన ప్రధాన అంతర్జాతీయ అవార్డు, ఉదాహరణకు పులిట్జర్ బహుమతి, ఆస్కార్ లేదా ఒలింపిక్ పతకం వంటివి ఆధారాలు సమర్పించడం లేదా USCIS నిర్దేశించిన 10 ప్రమాణాలలో కనీసం 3 ను తీర్చడం.
EB-1 వీసా కోసం ఎలా ధరఖాస్తు చేసుకోవాలి
మీకు ఎలాంటి ప్రత్యేక స్కిల్స్ లేని వర్గానికి చెందినవారైతే మీరు EB-1A కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు విదేశీ కార్మికుడి కోసం ఫారమ్ i-140 పిటిషన్‌ను సమర్పించి ఈ వీసా కోసం ధరఖాస్తు చేసుకోవచ్చు. EB-1 వీసా కోసం దాఖలు చేయడానికి EB-1B , EB-1C వేర్వేరు ప్రక్రియలను కలిగి ఉంటాయి. EB-1 పిటిషన్ ఆమోదించబడితే, దరఖాస్తుదారుడి జీవిత భాగస్వామి , 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అవివాహిత పిల్లలు కూడా యునైటెడ్ స్టేట్స్‌లో డిపెండెంట్లుగా ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కావచ్చు
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.