Gold Mine Blast in West Africa: పశ్చిమ ఆఫ్రికాలో వరుస పేలుళ్లు జరిగాయి. బుర్కినా ఫాసో(Burkina Faso)లోని బంగారు గని(Gold Mine)లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మంది గాయపడ్డారు. క్షతగాత్రల్లలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. సోమవారం నాడు జరిగిన ఈ పేలుడు బంగారం తవ్వడానికి ఉపయోగించే రసాయనాల వల్లే సంభవించినట్లు సమాచారం. నైరుతి బుర్కినా ఫాసోలోని అనధికారిక గోల్డ్ మైనింగ్ సైట్‌లో జరిగింది. పేలుడు ధాటికి గనిలో పనిచేస్తున్న కార్మికుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి హృదవిదాకరంగా మారిందని పేలుడు సమయంలో ప్రత్యక్ష సాక్షి అయిన సన్సన్ కాంబూ అన్నాడు. ఆ ప్రాంతమంతా భయానక దృశ్యం కనిపిస్తుందన్నారు. మొదటి పేలుడు మధ్యాహ్నం 2 గంటలకు సంభవించింది. దాని తర్వాత అనేక పేలుళ్లు సంభవించాయని ఆయన తెలిపారు.
అయితే పోనీ ప్రావిన్స్‌లో పేలుడు సంభవించడానికి కారణం ఇంకా తెలియరాలేదని పోనీ హైకమిషనర్ ఆంటోయిన్ డౌంబా రాష్ట్ర టెలివిజన్‌తో అన్నారు. ఆ స్థలంలో ఎలాంటి బంగారం తవ్వకాలు జరుగుతున్నాయనే దానిపై స్పష్టత రాలేదన్నారు. బుర్కినా ఫాసో ప్రాంతంలో అంతర్జాతీయ సంస్థలు అక్రమంగా బంగారం తవ్వరాలను చేపడుతున్నాయి. ఇందులో పర్యవేక్షణ, నియంత్రణ లేకుండా వందలాది చిన్న, అనధికారిక కార్మికులు పనిచేస్తున్నారు. ఆర్టిసానల్ గనులు అని పిలవబడే వాటిలో పిల్లలు కూడా పని చేస్తుంటారు. ఇక్కడ ప్రమాదాలు సాధారణమని స్థానిక మీడియా పేర్కొంది. ప్రపంచంలోని అత్యల్ప అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటైన బుర్కినా ఫాసో, వారి హింసాత్మక దాడులకు నిధులు సమకూర్చే సాధనంగా మైనింగ్ సైట్‌లపై నియంత్రణను కోరుకునే అల్ ఖైదా,ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధం ఉన్న ఇస్లామిక్ గ్రూపుల తరుచు దాడులు చేస్తుంటాయి.
జనవరి చివరిలో తిరుగుబాటు జరిగింది. గతవారం బుర్కినా ఫాసో జుంటా నాయకుడు లెఫ్టినెంట్ కల్నల్ పాల్ హెన్రీ దమీబా ప్రమాణ స్వీకారం చేశారు. సైనిక తిరుగుబాటు తర్వాత పశ్చిమ ఆఫ్రికా దేశాన్ని తన ఆధీనంలోకి తీసుకున్న ఒక నెల లోపే డామీబా అధ్యక్షుడయ్యారు. మాజీ అధ్యక్షుడు రోచ్ మార్క్ క్రిస్టియన్ కాబోర్ తిరుగుబాటు దళాలచే బంధించారు. రాష్ట్రపతి భవన్‌లో హోరాహోరీ పోరు సాగింది. దేశ రాజధాని ఒగాడోగులోని లామిజానా సంగోల్ మిలిటరీ బ్యారక్‌ను తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. తిరుగుబాటుకు మద్దతుగా పౌరులు నగరంలోకి ప్రవేశించారు. కబోర్ రాజీనామా కోసం ప్రజా ప్రదర్శన విజ్ఞప్తి చేసిన ఒక రోజు తర్వాత తిరుగుబాటు జరిగింది.
Read Also…