ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ అంటే ‘భయపడిపోతున్న’ యూరప్ దేశాలు, తాజాగా బ్యాన్ చేసిన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ కూడా,

| Edited By: Anil kumar poka

Mar 16, 2021 | 11:47 AM

ఆస్ట్రాజెనికా కరోనా వైరస్ వ్యాక్సిన్ కి ముఖ్యంగా యూరప్ దేశాల్లో విముఖత పెరిగిపోతోంది. ఇప్పటికే నెదర్లాండ్స్, డెన్మార్క్, ఐర్లాండ్ వంటి దేశాలు ఈ వ్యాక్సిన్ ని బ్యాన్ చే యగా.. తాజాగా....

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ అంటే భయపడిపోతున్న  యూరప్ దేశాలు,  తాజాగా  బ్యాన్ చేసిన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ కూడా,
We Will Ban Astrazeneca Vaccine Says Europe Countries
Follow us on

ఆస్ట్రాజెనికా కరోనా వైరస్ వ్యాక్సిన్ కి ముఖ్యంగా యూరప్ దేశాల్లో విముఖత పెరిగిపోతోంది. ఇప్పటికే నెదర్లాండ్స్, డెన్మార్క్, ఐర్లాండ్ వంటి దేశాలు ఈ వ్యాక్సిన్ ని బ్యాన్ చే యగా.. తాజాగా ఈ కోవలో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ దేశాలు కూడా చేరాయి. ఇక స్పెయిన్, పోర్చుగల్, స్లొవేనియా , లాటివా కూడా ఇదేదారి పడుతున్నాయి. ఈ టీకామందు తీసుకున్న రోగుల్లో రక్తం గడ్డ (బ్లడ్ క్లాటింగ్) కడుతున్న కేసులు పెరుగుతున్నాయని, సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తుతున్నాయని ఫిర్యాదులు ఎక్కువవుతుండడంతో క్రమంగా దీని బ్యాన్ చేస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు. ఇక ఇండోనేసియా కూడా ఈ వ్యాక్సిన్ దిగుమతి విషయంలో తొందరపడటం లేదు. జాప్యం జరిగినా ఇందుకు నిరసన గానీ, వ్యతిరేకత గానీ వ్యక్తం చేయలేదు. అయితే ఈ టీకామందు సురక్షితమైనదేనని, దీన్ని అత్యవసర వినియోగం కోసం రోగుల సేవలో వాడవచ్చునని  ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ స్పష్టం చేస్తున్నాయి. అయితే రోజురోజుకీ దీన్ని బ్యాన్ చేయాలన్న నిర్ణయం తీసుకుంటున్న దేశాల సంఖ్య పెరిగిపోతుండడంతో.. ఈ వారంలో మొత్తం పరిస్థితిని సమీక్షించేందుకు ఈ సంస్థలు నడుం కట్టాయి ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని ఇవి నిర్ణయించాయి. ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఆస్ట్రాజెనికాను అన్ని దేశాలు కొనసాగించవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన డైరెక్టర్ సౌమ్యా స్వామినాథన్ వెల్లడించారు.

ఈ బ్లడ్ క్లాటింగ్ కేసులకు, ఈ వ్యాక్సిన్ కి లింక్ ఉన్నట్టు తమకు ఇప్పటివరకు నిర్ధారణ కాలేదని ఆమె చెప్పారు. గురువారం యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ తన ప్రత్యేక సమావేశంలో ఈ అంశాన్ని సమీక్షిస్తుందని ఆమె తెలిపారు.కోవిడ్ 19 నివారణలో ఆస్ట్రాజెనికా ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని,  దీనివల్ల హాస్పిటలైజేషన్, డెత్ వంటి కేసులేవీ తమ దృష్టికి రాలేదని యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ వెల్లడించింది. అయితే ఆస్ట్రేలియా మాత్రం ఈ వ్యాక్సిన్ ను తాము వినియోగించుకుంటామని, తమ దేశంలో  ఇది తీసుకున్నవారిలో ఎలాంటి సమస్య తలెత్తలేదని స్పష్టం చేసింది.

మరిన్ని చదవండి ఇక్కడ : ఆ 73.. పురుషులకు.. ఒకటి మహిళకు..ఆమెకే ఎందుకిలా జరుగుతుంది..!?:International Cricketers Video

ఇక చెక్‌బుక్ లు పాస్‌బుక్ లు చెల్లవా ..?ఏప్రిల్ 1 నుండి అమలు..వివరాలు.: Cheque Book and Passbook Invalid Videoబుమ్రా సీక్రెట్ పెళ్లి..!టీవీ యాంకర్‌ను సడెన్‌గా పెళ్లి చేసుకున్న స్పీడ్ బౌలర్ : Jasprit Bumrah marries Sanjana Ganesan Video.