ఒక్కోసారి అంతే.. మనకు తెలియకుండానే అనుకోని ప్రమాదాల్లో చిక్కుకుంటూ ఉంటాం. చిన్న పొరబాట్లే అయినా ఇబ్బంది పడ్డాక గానీ అనిపించదు.. ఎంత పొరపాటు చేశామోనని. అలాంటి అనుకోని ఘటనే ఓ మహిళకు ఎదురైంది. ఆస్ట్రేలియాలోని సౌత్ వేల్స్‌లోని పాంటీప్రిడ్‌లో బెస్ట్ వన్ ఆఫ్-లైసెన్స్‌లో అన్నే హ్యూస్ (71) అనే ఓ మహిళా క్లినర్ గత సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఓ షాపు షర్టర్ వద్ద క్లీన్ చేస్తుంది. ఇంతలో షాపు యజమాని షాపు ఓపెన్ చేయడానికి ఆటోమెటేడ్ షట్టర్ మిషన్ ఆన్ చేశాడు.
అయితే అతను అక్కడ మహిళ ఉందన్న విషయం గమనించలేదు. ఇక్కడే పెద్ద పొరబాటు జరిగిపోయింది. హ్యూస్ ధరించిన షర్టు షట్టర్‌లో ఇరుక్కుపోయి.. షట్టర్‌తోపాటు ఆమె కూడా పైకి వెళ్లిపోయి గాల్లో తలకిందులుగా వేలాడుతూ అక్కడే ఉండిపోయింది. ఈ క్రమంలో ఆమె తన పక్కనే ఉన్న ట్రేను పట్టుకుని నిలదొక్కుకోవాలని ప్రయత్నించింది. కానీ ఆమె ప్రయాత్నాలేవీ ఫలించలేదు. దీంతో ఏం చేయాలో తోచక కాపాడాలంటూ ఆమె షాపు యజమానిని గట్టిగా పిలిచింది.
This woman was lifted into the air by the shop shutters while waiting to get into work pic.twitter.com/Vx41HFAuOb
— Crazed (@crazednet) March 6, 2024
జరిగిన పొరపాటు గ్రహించిన స్టోర్ మేనేజర్ అమెద్ అక్రమ్ (44) అక్కడికి చేరుకుని, షట్టర్‌ను కిందికి దించి హ్యూస్‌ను రక్షించాడు. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు. షాపు యజమాని స్పందించాడు కాబట్టి సరిపోయింది. లేదంటే అలా ఆమె గాల్లో ఎంతసేపు ఉండేదో..! ఈలోగా కోటు చిరిగి దబ్బుమని పడిపోయి ఉంటే.. ఊహించుకుంటే వామ్మో అనిపిస్తుంది కదూ. ఈ ఘటన తర్వాత పాపం ఆ క్లినర్.. ఇంకెప్పుడూ షట్టర్‌కి ఎదురు వెళ్లను. మంచి గుణపాఠం నేర్చుకున్నాను. దాని వద్దకు ఎప్పటికీ వెళ్లనని అంటోంది. ఈ మొత్తం సంఘటన షాపు వద్ద అమర్చి ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరూ చూసేయండి..
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.