Warren Buffett: బిల్ గేట్స్‌తో చెడిన స్నేహబంధం.. బఫెట్ సంచలన నిర్ణయం..!

ప్రపంచ అపర కుబేరుడు వారెన్ బఫెట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత 20 ఏళ్లుగా కొనసాగిస్తున్న బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్‌కు వార్షిక విరాళాన్ని ఈసారి తాత్కాలికంగా నిలిపివేశారు. జెఫ్రీ ఎప్స్టీన్ కేసు దర్యాప్తు, అందులో బిల్ గేట్స్ పేరు ప్రస్తావనలోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వారెన్ బఫెట్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Warren Buffett: బిల్ గేట్స్‌తో చెడిన స్నేహబంధం.. బఫెట్ సంచలన నిర్ణయం..!
Bill Gates And Warren Buffett

Updated on: Jul 02, 2026 | 1:15 PM

ప్రముఖ బిలియనీర్, పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ (Warren Buffett) గత 20 ఏళ్లుగా కొనసాగిస్తున్న ఒక సంప్రదాయానికి బ్రేక్ వేశారు. ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై ప్రారంభంలో బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్‌కు అందించే భారీ వార్షిక విరాళాన్ని ఆయన ఈసారి తాత్కాలికంగా నిలిపివేశారు. జెఫ్రీ ఎఫ్ట్సీన్ ఫైల్స్‌లో గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్‌ (Bill Gates) పేరు బయటకు రావడం,  జెఫ్రీ ఎప్స్టీన్ కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో వారెన్ బఫెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ (Jeffrey Epstein) కేసుకు సంబంధించిన అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ ఫైళ్లు బహిర్గతం కావడం సంచలం సృష్టించడం  తెలిసిందే.  బిల్ గేట్స్‌కు గతంలో ఎప్స్టీన్‌తో ఉన్న సంబంధాలపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. విల్మర్‌హేల్ అనే లా ఫర్మ్ మరికొన్ని మాసాల్లో దీనిపై పూర్తి నివేదికను సమర్పించనుంది. ఆ దర్యాప్తు నివేదిక వచ్చేవరకు గేట్స్ ఫౌండేషన్‌కు తన విరాళంపై నిర్ణయాన్ని వారెన్ బఫెట్ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వారెన్ బఫెట్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

దశాబ్ధాల స్నేహబంధానికి బీటలు..

వారెన్ బఫెట్, బిల్ గేట్స్ మధ్య దశాబ్దాల కాలంగా మంచి స్నేహబంధాలు ఉండేవి. అయితే ఎప్స్టీన్ ఫైల్స్‌లో బిల్ గేట్స్ పేరు బయటకు వచ్చినప్పటి నుండి వారిద్దని మధ్య స్నేహబంధం దెబ్బతిన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఈ ఫైళ్లు పబ్లిక్ అయిన తర్వాత తాను బిల్ గేట్స్‌తో మాట్లాడలేదని బఫెట్ మార్చిలోనే వెల్లడించారు. మే నెలలో జరిగిన బెర్క్‌షైర్ హాథ్‌వే వార్షిక సమావేశానికి కూడా బిల్ గేట్స్ హాజరుకాలేదు. 95 ఏళ్ల వారెన్ బఫెట్ ఈ విరాళంపై తన తుది నిర్ణయాన్ని 2026 చివరి భాగంలో ప్రకటించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

2006 నుండి 2025 మధ్య కాలంలో ప్రపంచ అపర కుబేరుడు వారెన్ బఫెట్ గేట్స్ ఫౌండేషన్‌కు దాదాపు 48 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.57 లక్షల కోట్లు) విలువైన బెర్క్‌షైర్ షేర్లను విరాళంగా ఇచ్చారు. అయితే, తన మరణానంతరం గేట్స్ ఫౌండేషన్‌కు తన ఆస్తి నుండి ఎలాంటి నిధులు వెళ్లవని ఆయన గతంలోనే స్పష్టంచేశారు. అయితే ఈ  విరాళాల నిలిపివేతను కేవలం గేట్స్ ఫౌండేషన్‌కు మాత్రమే పరిమితం చేశారు. బఫెట్ పిల్లలు నడిపే ఇతర స్వచ్ఛంద సంస్థలకు, ఆయన మొదటి భార్య పేరిట ఉన్న ఫౌండేషన్‌కు ఇచ్చే విరాళాలు ఎప్పటిలాగే కొనసాగుతాయి.

Also Read: రతన్ టాటా చెప్పిన ECG ఫార్ములా..ఇది తెలిస్తే మీరు ఓటమికి భయపడరు..!

Follow Us