సూర్యునిపై అద్భుత దృశ్యం ఒకటి కనిపించింది. సూర్యుని ఉపరితలం మీదుగా ఒక పాము జరజర పాకుతూ వెళ్తున్న దృశ్యం కనువిందు చేసింది. ఏంటి సూర్యున్ని ఓరకంట చూడ్డం కూడా సాధ్యం కాదు, అలాంటిది సూర్యుడిపైన పాము కనిపించడమేంటి అనుకుంటున్నారా… అవును.. యూరోపియన్ ఆర్బిటర్ ద్వారా సూర్యునిపై ఈ విచిత్రమైన ఘటన కనిపించిందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పేర్కొంది. ఐతే అది సూర్యుని అయస్కాంత క్షేతం గుండా వెళ్తున్న చల్లటి వాతావరణ వాయువుల గొట్టంగా పేర్కొంది. అది చూడటానికి అచ్చం భగభగమండే సూర్యుని ఉపరితలంపై పాకుతున్న పాములా కనిపిస్తోంది.
కాగా దీన్ని పాము రూపంలో ఉన్న ప్లాస్మా అని, అది సూర్యునిపై ఒక వైపు నుంచి మరోవైపుకు అయస్కాంత క్షేత్రం ఫిలమెంట్‌ను అనుసరిస్తుందని స్పేస్ ఏజెన్సీ తెలిపింది. అక్టోబర్ 12న సోలార్ ఆర్బిటర్ సూర్యుని వైపు ప్రయాణించినప్పుడు ఈ అరుదైన దృశ్యం చూడగలిగామని ముల్లార్డ్ స్పేస్ సైన్స్ లాబోరేటరీ శాస్త్రవేత్త డేవిడ్ లాంగ్ తెలిపారు.
Spot the solar snake slithering across the #Sun! ?
This ‘tube’ of cooler atmospheric gases snaking its way through the Sun’s magnetic field was captured by @esasolarobiter’s @EuiTelescope on 5 September, ahead of a large eruption ?
? https://t.co/FJgXYq1vwp #ExploreFarther pic.twitter.com/02uIJMMCBH
— ESA Science (@esascience) November 14, 2022
అదీగాక అయస్కాంత క్షేత్రం వక్రీకృతమైంది కాబట్టి ఈ దృశ్యాన్ని చూడగలిగామని అన్నారు. ఇదిలా ఉంటే సోలార్ ఆర్బిటర్ ఫిబ్రవరి 2020లో ప్రారంభమైంది. ఇది అమెరికా స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ స్సేస్ ఏజెన్సీల ఉమ్మడి ప్రాజెక్టు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..