Viral Video: విశ్వాసంగల జంతువు అంటే కుక్క అంటారు అయితే.. మనిషిని ప్రేమించే జంతువులో ఏనుగు కూడా ఒకటి. నిజానికి మనిషి జీవిత విధానానికి ఏనుగుల జీవన విధానానికి దగ్గర పోలికలు ఉంటాయి. తాజాగా ఏనుగుల గుంపుకు చెందిన ఓ వీడియో వైరల్ గా మారింది. థాయ్‌లాండ్‌లోని ఒక అభయారణ్యంలో 14 నెలల తర్వాత ఏనుగుల గుంపు తమ సంరక్షకుడిని తిరిగి కలిశాయి. ఎంతో ప్రేమగా తమ సంరక్షకుడిని హత్తుకున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోను ట్విటర్‌లో బ్యూటెంగేబిడెన్ షేర్ చేసారు. ఏనుగుల గుంపు నీటిలో నడుచుకుంటూ ఎంతో సంతోషంగా తమ సంరక్షకుని వైపు నడుచుకుని వచ్చాయి. తమ సంరక్షకుడిని ఎంతో ప్రేమగా తొండంతో హత్తుకున్నాయి. అతడిని కౌగిలించుకున్నాను. దీంతో ఏనుగుల సంరక్షుడు కూడా ఏనుగులను ఎంతో ప్రేమగా తడుముతున్నాడు. వీరి ప్రేమ చూపరుల హృదయాలను హత్తుకుంది. అంతేకాదు జంతువులు మానవులకు నమ్మకమైన సహచరులు.. ఇది చెప్పబడటానికి ఇదొక మంచి ఉదాహరణ అంటున్నారు.
ఈ వీడియో 3.7 మిలియన్లకు పైగా వ్యూస్ , 1.5 లక్షలకు పైగా లైక్‌లు సొంతం చేసుకుంది. హృదయాన్ని కదిలించే ఈ వీడియో క్లిప్ కు నెటిజన్లు ఫిదా అవ్వడమే కాదు.. షరతులు లేని స్వచ్ఛమైన ప్రేమ.. ఏనుగులు బహుశా చాలా మంది మానవుల కంటే మానవత్వం కలిగి ఉంటాయి.. .నాకు ఏనుగుల అంటే ప్రేమ.. బహుశా ఏనుగులు మానవుల కంటే మేధస్సులో ఉన్నతంగా ఉంటాయి.. దేవుడా నాకు ఏనుగులంటే చాలా ఇష్టం. వాటిని ఎల్లప్పుడూ రక్షించు అంటూ విభిన్న కామెంట్స్ చేశారు. ఏనుగులు తమ కుటుంబాన్ని ఎప్పటికీ మర్చిపోవు. నేను ఏనుగులను ప్రేమిస్తున్నాను. ఈ వీడియోలో ఏనుగుల ప్రేమ చాలా అందంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Elephants reunite with their caretaker after 14 months..
Sound on pic.twitter.com/wSlnqyuTca
— Buitengebieden (@buitengebieden_) December 23, 2021