Viral Video: అల్లా మాకు నవాజ్ షరీఫ్, బెనజీర్ భుట్టో, ఇమ్రాన్ ఖాన్‌, ముషారఫ్‌లు వద్దు .. మోడీ కావాలంటున్న పాక్ పౌరుడు

|

Feb 24, 2023 | 8:09 AM

పగలు, ప్రతీకారాలతో రగిలిపోయే దాయాది దేశంలో అఖండ భారత్‌ మాట వినిపిస్తోంది. ఈ మాటలు చెబుతోంది ఎవరో కాదు..24 గంటలూ భారతీయులంటే పగలు, ప్రతీకారాలతో రగిలిపోయే పాకిస్థానీయులే..

Viral Video: అల్లా మాకు నవాజ్ షరీఫ్, బెనజీర్ భుట్టో, ఇమ్రాన్ ఖాన్‌, ముషారఫ్‌లు వద్దు .. మోడీ కావాలంటున్న పాక్ పౌరుడు
Pak Man Wants Modi
Follow us on

ఇస్తాంబుల్‌ టు ఇస్లామాబాద్‌ మోదీ జిందాబాద్‌..ఇదీ ఇప్పుడు టర్కీ నుంచీ పాకిస్తాన్‌ వరకు వినిపిస్తున్న మాట.. మోదీ దౌత్యనీతిపై ప్రపంచ దేశాలే సాహో అంటున్నాయి. ఎప్పుడూ ఇండియాను ఆడిపోసుకునే పాక్‌ మీడియా కూడా మోదీని నెత్తిన పెట్టుకుంటోంది. పాకిస్తాన్‌ పౌరులు కూడా షరీఫ్‌లు, ఇమ్రాన్‌లు మాకొద్దేవద్దు..మోదీ మాత్రమే కావాలంటున్నారు. పగలు, ప్రతీకారాలతో రగిలిపోయే దాయాది దేశంలో అఖండ భారత్‌ మాట వినిపిస్తోంది. ఈ మాటలు చెబుతోంది ఎవరో కాదు..24 గంటలూ భారతీయులంటే పగలు, ప్రతీకారాలతో రగిలిపోయే పాకిస్థానీయులే..ఎందుకంటే..ఆర్థిక సంక్షోభంతో పాకిస్థాన్‌ అతలాకుతలమవుతోంది.. పెరుగుతోన్న నిత్యావసర, ఇంధన ధరలు, రాయితీల్లో కోత వంటివి స్థానికుల్లో ప్రభుత్వంపై ఆగ్రహం తెప్పిస్తున్నాయి..ఇదే టైమ్‌లో.. ఓ పాకిస్థాన్‌ పౌరుడు దేశ పరిస్థితులపై స్పందించిన తీరు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

పాక్‌ నుంచి ప్రాణాలతో పారిపోండి. భారత్‌లోకి అయినా సరే అనే నినాదాలు పాకిస్తాన్‌లో కొద్ది రోజులుగా జోరుగా వినిపిస్తున్నాయి. అసలు పాక్ ను భారత్ నుంచి వేరు చేసి ఉండకూడదని.. తాను భావిస్తున్నట్లు చెప్పాడు ఆ పాక్ పౌరుడు.. అంతేకాదు భారత్ లోని ముస్లింలు తింటున్నట్లు.. తాము కూడా టొమాటోలను కేజీ రూ.  20, చికెన్ రూ. 150, పెట్రోల్‌ను లీటర్ 50 చొప్పున కొనుగోలు చేసుకునేవారమని అతను చెప్పిన వీడియో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మోడీ పాలనలో జీవించేందుకు తాము సిద్ధమేనంటున్నాడు. మోడీ గొప్ప వ్యక్తి అని..చెడ్డవాడు కాదని అంటున్నాడు. ఈ మాట ఒక్క పాకిస్థానీయులే కాదు.. ఇస్తాంబుల్‌ నుంచి ఇస్లామాబాద్‌ వరకు వినిపిస్తున్నమాట..ముస్లిం దేశాల్లో మోదీ ప్రతిష్ట అమాంతం పెరిగిపోయింది. ప్రపంచంలో ఎవరికీ ఏ కష్టం వచ్చినా మొదటగా మేమున్నామంటూ ముందుకొచ్చేది భారతదేశం అని అంటున్నారు.  అందుకే హిందూస్థాన్‌కు సలాం చేస్తున్నారు. పాకిస్థానీయులు కూడా మోదీనే కావాలంటున్నారు. అఖండ భారత్‌ నినాదాలకు బీజం వేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..