Elon Musk DOG: ట్విట్టర్ సీఈఓ కుర్చీలో కుక్కను కూర్చోబెట్టిన మస్క్..! వీడియో వైరల్..

Elon Musk DOG: ట్విట్టర్ సీఈఓ కుర్చీలో కుక్కను కూర్చోబెట్టిన మస్క్..! వీడియో వైరల్..

Anil kumar poka

|

Updated on: Feb 24, 2023 | 8:25 AM

ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మరోసారి సంచలనంగా మారారు. తన పెంపుడు కుక్క ఫ్లోకిని ట్విట్టర్‌ సీఈఓ కుర్చీలో కూర్చొబెట్టారు. దీనికి సీఈఓ అని రాసి ఉన్న టీ షర్ట్‌ను తొడిగించి

ప్రపంచ కుబేరుడు, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మరోసారి సంచలనంగా మారారు. తన పెంపుడు కుక్క ఫ్లోకిని ట్విట్టర్‌ సీఈఓ కుర్చీలో కూర్చొబెట్టారు. దీనికి సీఈఓ అని రాసి ఉన్న టీ షర్ట్‌ను తొడిగించి మరీ కూర్చోబెట్టారు. ట్విట్టర్ కొత్త సీఈఓ ఇతనే అంటూ ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు ఇదివరకు సీఈఓగా పని చేసిన భారతీయుడు పరాగ్ అగర్వాల్‌పై మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. పరాగ్ కంటే తన కుక్క ఫ్లోకినే మెరుగ్గా పని చేస్తుందన్నారు. అనుహ్య పరిణామాల తర్వాత ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న ఎలన్ మస్క్ సంచలన నిర్ణయాలతో ప్రక్షాళన మొదలుపెట్టారు. అందులో పని చేస్తున్న కీలక వ్యక్తులపై చర్యలు తీసుకున్నారు. ఈ డీల్ పూర్తయిన వెంటనే పరాగ్ అగర్వాల్‌ తో పాటు ట్విట్టర్ లీగల్ హెడ్ విజయ గద్దె, సీఎఫ్ ఓ నెల్ సెగల్ ను తొలగించారు. వారిపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా తన పెంపుడు కుక్కను సీఈవోగా ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.

Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?

Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..

Published on: Feb 24, 2023 08:23 AM