Telugu News World Viral Video: Massive Fire At China Skyscraper, Dozens Of Floors Burning Ferociously
China Skyscraper Fire: చైనా ఆకాశహర్మ్యంలో భారీ అగ్నిప్రమాదం.. కాలిపోతున్న డజన్ల కొద్దీ అంతస్తులు.. మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్న సిబ్బంది
చైనాలో అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోలను స్థానికులు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. బిల్డింగ్ నుంచి దట్టమైన పొగ వెదజల్లుతోంది. ఈ ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారో ఇంకా తెలియల్సీ ఉంది.
China Skyscraper Fire: చైనాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సెంట్రల్ చైనీస్ నగరం ఛాంగ్సూ లోని ఆకాశహర్మ్యం అగ్నికి ఆహుతి అవుతుంది. బిల్డింగ్ లోని నేక అంతస్తుల్లో మంటలు వ్యాపించాయని స్థానిక మీడియా ఓ వీడియో నివేదించిండి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టారు. మంటల్ని ఆర్పేందుకు అగ్ని మాపక సిబ్బంది శ్రమిస్తోంది. బాధితులను రక్షించడానికి శ్రమిస్తున్నారు.
అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోలను స్థానికులు ట్విట్టర్‌లో పోస్టు చేశారు. బిల్డింగ్ నుంచి దట్టమైన పొగ వెదజల్లుతోంది. ఈ ప్రమాదంలో ఎంత మంది గాయపడ్డారో ఇంకా తెలియల్సీ ఉంది.
This afternoon, the building of China Telecom building in Changsha长沙caught fire, no casualties reported yet, stay safe everyone! ? pic.twitter.com/QNnezk2Mxk
చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం బిల్డింగ్‌లో భవనంలో అస్మాత్తుగా మంటలు చెలరేగాయని స్థానికులు చెప్పారు. CCTV ద్వారా విడుదలైన ఒక వీడియోలో నగరంలోని ఎత్తైన భవనంలో నారింజ రంగు మంటలు చెలరేగుతున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం తర్వాత నల్లటి పొగ ఆకాశంలోకి వ్యాపించింది. హునాన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్షాలో దాదాపు 10 మిలియన్ల జనాభా ఉంది.