Viral News: చిలుక మాట్లాడటం తెలుసు. కానీ.. ఆస్ట్రేలియాలో ఓ బాతు ‘యూ బ్లడీ ఫూల్’ అని అంటోంది. ఆస్ట్రేలియన్ మస్క్ జాతికి చెందిన సదరు బాతు మాటలను ఫిలసాఫికల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ రికార్డ్ చేసింది. ఈ బాతు తన కేర్ టేకర్ నుంచి పదేపదే వచ్చిన ‘యూ బ్లడీ ఫూల్’ అనే మాటను విని నేర్చుకుందని పరిశోధకులు చెబుతున్నారు. నిజానికి మస్క్ బాతులు మనుషులు మాటలను అనుకరిస్తాయని అంటున్నారు. ఈ బాతు పేరు రిప్పర్ అనే పేరు పెట్టారు పరిశోధకులు.
ప్రస్తుతం ఈ బాతు ఆడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ ఆడియో విని నెటిజన్లు పలు రకాల కామెంట్స్ పెడుతున్నారు. కొందరు బాతు మాటలు విని ఆశ్చర్యపోతున్నారు. కాగా, కస్తూరి బాతులు, చిలుకలు, యూరోపియన్ స్టార్లింగ్స్, మైనా పక్షులు, బడ్జెరిగర్స్ వంటి స్వరాలు చేసే సామర్థ్యం ఉందని అధ్యయనంలో తేలింది. కాగా, కొన్ని దేశాల్లో ఉండే పక్షులు రకరకాలుగా శబ్దాలు చేస్తుంటాయి. అవి వింటుంటూ ఒక విధంగా ఉంటుంది. అలాగే ఆస్ట్రేలియాలో ఉండే పక్షులు కూడా వింత వింతగా ఉండే శబ్దాలు చేస్తుండటం అందరిని ఆశ్యర్యం కలిగిస్తుంటాయి. ఈ బాతు కూడా ఇలా మాటలు పలకడం ఆశ్యర్యానికి గురి చేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ జాతికి చెందిన బాతు మనుషుల మాటలను అనుకరిస్తుంటాయని గుర్తించినట్లు పరిశోధకులు చెబుతున్నారు.