పాక్ బౌద్ధ దేవాలయంలో 2000 ఏళ్ల నాటి నిధి లభ్యం.. మొహెంజొదారో కాలం నాటివి అంటున్న పురావస్తు శాస్త్రవేత్తలు

భూమిలో దాచిన సంపదలు కొన్నిసార్లు భూమి అట్టడుగు పొరల్లో..  కొన్నిసార్లు సముద్రంలో కలిసిపోతాయని వాటిని శోధించి బయటకు తీస్తే  విలువైన సంపద, నగలు కనిపిస్తాయి. ఇలాంటి పురాతన సంపాదన వెలుగులోకి వచ్చిన ఉదంతాలు, కథనాలు అనేకం తరచుగా వింటూనే ఉన్నాం. ప్రస్తుతం కూడా తవ్వకాల్లో వెలుగులోకి వచ్చిన ఓ నిధి గురించి జనాల్లో చర్చనీయాంశమైంది. కుషాణుల కాలం నాటి సంపద ప్రజల ముందుకు వచ్చింది. 

పాక్ బౌద్ధ దేవాలయంలో 2000 ఏళ్ల నాటి నిధి లభ్యం..  మొహెంజొదారో కాలం నాటివి అంటున్న పురావస్తు శాస్త్రవేత్తలు
Buddhist Shrine In Pakistan

Updated on: Dec 02, 2023 | 2:55 PM

భూమిని తవ్వుతున్న సమయంలో ఒకొక్కసారి మన పూర్వాకుల చరిత్రను, వైభవాన్ని తెలియజేసే విధంగా రకరకాల వస్తువులు లభిస్తూ ఉంటాయి. పూర్వకాలంలో మానవులు తమ సంపదను బిందెల్లో దాచిభూమిలో పాతి పెట్టేవారని చారిత్రుకులు చెబుతూ ఉంటారు. ఒకొక్కసారి ఇలాంటి సంపద తవ్వకాలలో బయల్పడతాయి. ఇలా భూమిలో దాచిన సంపదలు కొన్నిసార్లు భూమి అట్టడుగు పొరల్లో..  కొన్నిసార్లు సముద్రంలో కలిసిపోతాయని వాటిని శోధించి బయటకు తీస్తే  విలువైన సంపద, నగలు కనిపిస్తాయి. ఇలాంటి పురాతన సంపాదన వెలుగులోకి వచ్చిన ఉదంతాలు, కథనాలు అనేకం తరచుగా వింటూనే ఉన్నాం. ప్రస్తుతం కూడా తవ్వకాల్లో వెలుగులోకి వచ్చిన ఓ నిధి గురించి జనాల్లో చర్చనీయాంశమైంది. కుషాణుల కాలం నాటి సంపద ప్రజల ముందుకు వచ్చింది.

అయితే ఈ సంపాదన మన దాయాది దేశం పాకిస్తాన్ లో బయల్పడింది. 2000 సంవత్సరాల నాటి నాణేలతో కూడిన అత్యంత అరుదైన నిధి ఇక్కడ లభించింది. ఈ నిధిలోని చాలా నాణేలు రాగితో తయారు చేయబడ్డాయి, ఇవి బౌద్ధ దేవాలయ శిధిలాల తవ్వకాల్లో బయటపడ్డాయి. లైవ్‌సైన్స్ ఈ నిధికి సంబంధించిన నివేదికను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇది మధ్య ఆగ్నేయ పాకిస్తాన్‌లోని 2600 BC నాటి మొహెంజొదారో కాలం నాటి భారీ శిధిలాల్లో వెలుగులోకి వచ్చిందని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఈ నాణేలు ఎలా ఉన్నాయంటే

ఈ నిధి గురించి పురావస్తు శాస్త్రవేత్త..  గైడ్ షేక్ జావేద్ అలీ సింధీ మాట్లాడుతూ ఇది మొహెంజొదారో పతనం తర్వాత సుమారు 1600 సంవత్సరాల నాటిదని చెప్పారు. ఆ తర్వాత శిథిలాల మీద స్థూపం నిర్మించారు. త్రవ్వకాల్లో ఈ నాణేలను కనుగొన్న బృందంలో షేక్ జావేద్ కూడా ఒకరు.

ఈ దొరికిన నాణేల రంగు పూర్తిగా ఆకుపచ్చగా ఉంది. ఎందుకంటే రాగి గాలిని తాకిన తర్వాత రంగు మారుతుంది. శతాబ్దాల తరబడి పాతిపెట్టి ఉండడంతో నాణేలు గుండ్రంగా ఒక రాయిలా మారాయని.. ఈ నిధి బరువు సుమారు 5.5 కిలోల బరువుంటుందని పురావస్తు శాస్త్రవేత్తలు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..