US Woman: ఆమె మద్యం సేవించదు.. లిక్కర్ అంటేనే ఆమడదూరంలో ఉంటుంది. కానీ మత్తులో తూలుతుంది. ప్రతీ రోజూ ఫుల్ కిక్కులో ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఆమెకు మద్యం సేవించడం అలవాటు లేకపోయినా.. ఎందుకు మత్తులో ఉంటుందో ఎవరికీ అర్ధం కాని ప్రశ్న.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అమెరికాకు చెందిన సారా అనే మహిళకు చిన్నప్పటి నుంచి ఈ వింత పరిస్థితిని ఎదుర్కుంటోంది. మద్యం సేవించకపోయినా.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అనేక సార్లు దొరికింది. చివరికి చేసేది ఏమిలేక వైద్యులను సంప్రదించింది. అప్పుడు అసలు విషయం బయటపడింది. ‘ఆటో బ్రేవరీ సిండ్రోమ్’ అనే వ్యాధితో ఆమె బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. కడుపులో ఉండే ఈస్ట్ ఫంగస్ మిథనాల్‌గా మారి రక్తంలో కలిసిపోవడం వల్ల ఎప్పుడూ మత్తులో ఉండటం జరుగుతుందని డాక్టర్లు పేర్కొన్నారు. ఇక దీనికి పరిష్కారం లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అని చెప్పారు.
Also Read: