America – Russia: ఆ దేశాన్ని వీడి.. స్వదేశానికి రండి.. అగ్రరాజ్యం కీలక సూచన

|

Feb 12, 2022 | 7:58 AM

ఉక్రెయిన్‌ (Ukraine) పై రష్యా దాడి ఏరియల్ బాంబింగ్, క్షిపణి దాడులతో ప్రారంభమయ్యే అవకాశం ఉందని వైట్‌హౌస్(White House) జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ ఆందోళన వ్యక్తం చేశారు.

America - Russia: ఆ దేశాన్ని వీడి.. స్వదేశానికి రండి.. అగ్రరాజ్యం కీలక సూచన
Ukraine
Follow us on

ఉక్రెయిన్‌ (Ukraine) పై రష్యా దాడి ఏరియల్ బాంబింగ్, క్షిపణి దాడులతో ప్రారంభమయ్యే అవకాశం ఉందని వైట్‌హౌస్(White House) జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ ఆందోళన వ్యక్తం చేశారు. అది తమ దేశ పౌరులను చంపగలదని తెలిపారు. అందుకే ఉక్రెయిన్‌లోని ఏ అమెరికన్ అయినా వీలైనంత త్వరగా స్వదేశానికి వెళ్లిపోవాలని సూచించారు. ఈ మేరకు బైడెన్ శనివారం పుతిన్‌తో మాట్లాడతారని అన్నారు. పౌరుల తరలింపునకు సైన్యాన్ని పంపిస్తే.. ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చని పేర్కొంది. ఇది ఉగ్రవాద సంస్థతో వ్యవహరిస్తున్నట్లు కాదని, ప్రపంచంలోని అతిపెద్ద సైనిక వ్యవస్థలో ఒకటైన రష్యాతో వ్యవహరిస్తున్న తీరు అని వివరించింది. పరిస్థితులు వేగంగా మారవచ్చన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్.. అమెరికన్లను తరలించడానికి భద్రతా దళాలను ఉక్రెయిన్‌కు పంపితే అది ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు అని ఆందోళన వ్యక్తం చేశారు.

మరో వైపు తమ దేశ పౌరులకు అమెరికా స్టేట్​ డిపార్ట్​మెంట్​ కూడా ఇదే విధమైన సూచనలు చేసింది. వీలైనంత త్వరగా ఉక్రెయిన్ వీడాలని సూచించింది. రష్యన్​ సైనిక చర్య, కరోనా నేపథ్యంలో ఉక్రెయిన్‌కు వెళ్లొద్దని కోరింది. ప్రస్తుతం అక్కడ ఉన్నవారు వాణిజ్య లేదా ప్రైవేట్ మార్గాల ద్వారా తక్షణమే బయలుదేరాలని సూచించింది. రష్యా సైనిక చర్యకు దిగితే.. కొన్ని ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయని తెలిపింది. ఇప్పటికే ఉక్రెయిన్​లోని తమ ఉద్యోగులు, వారి కుటుంబాలను బైడెన్​ సర్కారు స్వదేశానికి తరిలించింది.

Also Read

UGC: కాలేజీ, యూనివర్సీటీలకు UGC కీలక ఆదేశాలు.. కొత్త మార్గదర్శకాలు విడుదల..

Hyderabad: బరువు తగ్గిస్తామంటూ బురిడీ.. అమాయకులను దోచుకుంటున్న వెయిట్ లాస్ క్లినిక్‌లు.. షాకింగ్ విషయాలు..

Gold Silver Prices Today: గుడ్‌న్యూస్.. స్థిరంగానే బంగారం ధరలు.. స్వల్పంగా తగ్గిన వెండి రేట్లు..