Kamala Harris: లాంగ్ వీకెండ్ ని ఎంజాయ్ చేయాలంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ట్వీట్…, మండిపడిన నెటిజన్లు, ఎంపీలు

| Edited By: Phani CH

May 30, 2021 | 9:05 AM

లాంగ్ వీకెండ్ ని ఎంజాయ్ చేయాలంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ చేసిన ట్వీట్ దేశంలో వివాదాస్పదమైంది.

Kamala Harris: లాంగ్ వీకెండ్ ని ఎంజాయ్ చేయాలంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ట్వీట్..., మండిపడిన నెటిజన్లు, ఎంపీలు
Kamala Harris
Follow us on

Kamala Harris: లాంగ్ వీకెండ్ ని ఎంజాయ్ చేయాలంటూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ చేసిన ట్వీట్ దేశంలో వివాదాస్పదమైంది. ముఖ్యంగా నెటిజన్లు, పలువురు ప్రముఖులు, ఎంపీలు ఈ ట్వీట్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరునవ్వుతో కమలా హారిస్ తన ఫొటోతో కూడిన పోస్టును పెట్టడం చూసిన వీరు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అమెరికా రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించి అమరులైన సైనికులను స్మరించేందుకు..సంతాప దినంగా శనివారం రోజును పాటిస్తుంటే ఈమె.. వీకెండ్ ఎంజాయ్ చేయమంటూ కోరడమేమిటని వీరంతా ప్రశ్నించారు.దీన్ని మెమోరియల్ డేగా పాటిస్తున్న విషయం ఆమెకు తెలియదా అన్నారు. ఈ దేశం కోసం తన కొడుకు ప్రాణాలు అర్పించాడని, అలాంటిది మీరు ఎంజాయ్ చేయాలనీ ఎలా పిలుపునిస్తారని ఓ తల్లి ఆవేదనగా ప్రశ్నించింది. ఎనీ హౌ థాంక్స్ మేడం అని వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. అలాగే లీ జెల్దిన్ అనే ఎంపీ..ఈ దేశంకోసం సైన్యంలో పని చేస్తున్న ఎంతోమంది మహిళలు, పురుషులు తృణ ప్రాయంగా తమ ప్రాణాలు అర్పించారని, వారి స్మృతికి మనం నివాళులు అర్పించాల్సి ఉందని అన్నారు.ఈ తరుణంలో మీరు ఈ ట్వీట్ ఎలా చేస్తారని ఆయన కూడా మండిపడ్డారు. కొందరు దీన్ని ‘డిజప్పాయింటింగ్ ట్వీట్’ అని అభివర్ణించారు. అయితే కమలా హారిస్ అభిమానులు మాత్రం.. సైనికులను గౌరవించే విషయంలో తమ నేత ఎప్పుడూ ముందుంటారని, మిలిటరీ ప్రయోజనాలకోసం గత ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం శ్రమిస్తే హారిస్, జోబైడెన్ నేతృత్వంలోని ప్రభుత్వం కేవలం ఆరు నెలల్లోనే కృషి చేసిందన్నారు.

కాగా-శనివారం రోజును మెమోరియల్ డే గా వైట్ హౌస్ ప్రకటిస్తూ ఓ ప్రొక్లమేషన్ జారీ చేసింది. అమర సైనికులకు నివాళులు అర్పించాలని ఇందులో కోరింది. దీనిపై అధ్యక్షుడు బైడెన్ సంతకం చేశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Corona Vaccine: వ్యాక్సిన్‌ వేసుకొని రూ. 7 కోట్లు గెలుచుకున్న యువతి.. ( వీడియో )

Social Media: ఇకపై ఫేస్‌బుక్‌ మరియు ఇన్‌స్టాలో లైక్స్‌ కనిపించవు..!! ( వీడియో )