దావూద్ పాక్‌లోనే ఉన్నాడు: లండన్‌ కోర్టుకు తెలిపిన అమెరికా

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడని అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఈ లండన్‌ కోర్టుకు తెలిపింది. దావూద్ ముఖ్య అనుచరుడు జబీర్ మోటీ అప్పగింతపై జరుగుతున్న విచారణలో మొదటిరోజు అమెరికా ప్రభుత్వం తరఫున వాదిస్తున్న జాన్ మార్డీ అనే న్యాయవాది.. దావూద్, పాక్‌లోనే ఉన్నాడన్న విషయాన్ని స్పష్టం చేశారు. భారత్, పాకిస్తాన్, యూఈఏలో దావూద్ కంపెనీ సాగిస్తున్న దందాలపై ఎఫ్‌బీఏ దర్యాప్తును చేస్తోందని ఆయన వివరించారు. అయితే కరాచీలో దావూద్ ఆచూకీపై భారత్.. […]

దావూద్ పాక్‌లోనే ఉన్నాడు: లండన్‌ కోర్టుకు తెలిపిన అమెరికా
Follow us

| Edited By:

Updated on: Jul 03, 2019 | 1:04 PM

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడని అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఈ లండన్‌ కోర్టుకు తెలిపింది. దావూద్ ముఖ్య అనుచరుడు జబీర్ మోటీ అప్పగింతపై జరుగుతున్న విచారణలో మొదటిరోజు అమెరికా ప్రభుత్వం తరఫున వాదిస్తున్న జాన్ మార్డీ అనే న్యాయవాది.. దావూద్, పాక్‌లోనే ఉన్నాడన్న విషయాన్ని స్పష్టం చేశారు. భారత్, పాకిస్తాన్, యూఈఏలో దావూద్ కంపెనీ సాగిస్తున్న దందాలపై ఎఫ్‌బీఏ దర్యాప్తును చేస్తోందని ఆయన వివరించారు.

అయితే కరాచీలో దావూద్ ఆచూకీపై భారత్.. పలు సందర్భాలలో అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలను ప్రశ్నిస్తూ వచ్చింది. ఇదిలా ఉంటే నిఘా వర్గాల సమాచారం ప్రకారం కరాచీలో దావూద్ సర్వభోగాలను అనుభవిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఆయనకు సంబంధించిన టెలిఫోన్ బిల్లు, పాకిస్తాన్ పాస్‌పోర్టుకు సంబంధించిన ఆధారాలు కూడా భారత నిఘా వర్గాల వద్ద ఉన్నాయి. దాని ప్రకారం కరాచీ డెవలప్‌మెంట్ అథారిటీలోని బ్లాక్ ఫోర్‌లో అతడు నివాసం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే దావూద్ తమ దేశంలో లేడని పాకిస్తాన్ ఎప్పటినుంచో బుకాయిస్తూ వస్తున్న విషయం తెలిసిందే.