పరస్పరం ఆర్థిక మూలాలే టార్గెట్‌.. అమెరికా వెన్నెముకను విరిచేందుకు ఇరాన్ మాస్టర్ ప్లాన్‌!

ఇరాన్ యుద్దం తీవ్రస్థాయికి చేరుకునేలా కనిపిస్తోంది. యుద్ధం ఆపకపోతే ఇక విధ్వంసమే అన్న ట్రంప్‌ హెచ్చరికలకు.. అదే స్థాయిలో కౌంటర్‌ ఎటాక్‌ చేసింది ఇరాన్‌. ఏకంగా అమెరికా ఆర్థిక వెన్నెముకను విరిచేసే మాస్టర్ ప్లాన్‌ను బయటపెట్టింది. ఇప్పుడీ యుద్ధ జ్వాలలు.. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాల గుమ్మం వరకు చేరాయి. ఇరాన్ ప్రకటించిన 'హిట్ లిస్ట్' ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది!

పరస్పరం ఆర్థిక మూలాలే టార్గెట్‌.. అమెరికా వెన్నెముకను విరిచేందుకు ఇరాన్ మాస్టర్ ప్లాన్‌!
Us Warning To Iran

Updated on: Apr 01, 2026 | 7:03 AM

ఇరాన్ యుద్దం తీవ్రస్థాయికి చేరుకునేలా కనిపిస్తోంది. యుద్ధం ఆపకపోతే ఇక విధ్వంసమే అన్న ట్రంప్‌ హెచ్చరికలకు.. అదే స్థాయిలో కౌంటర్‌ ఎటాక్‌ చేసింది ఇరాన్‌. ఏకంగా అమెరికా ఆర్థిక వెన్నెముకను విరిచేసే మాస్టర్ ప్లాన్‌ను బయటపెట్టింది. ఇప్పుడీ యుద్ధ జ్వాలలు.. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాల గుమ్మం వరకు చేరాయి. ఇరాన్ ప్రకటించిన ‘హిట్ లిస్ట్’ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది!

యుద్ధం ఆపేందుకు ససేమిరా అంటోన్న ఇరాన్‎కు అమెరికా మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. నెల రోజులుగా సాగుతోన్న యుద్ధాన్ని ఆపేందుకు అమెరికాతో ఇరాన్ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని లేదంటే మునుపటి కంటే తీవ్రమైన సైనిక చర్యను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించింది. హర్మూజ్‌ జలసంధి వాణిజ్య కార్యకలాపాల కోసం తెరుచుకోకపోతే ఇరాన్‌కు చెందిన పవర్‌ ప్లాంట్స్‌, చమురు బావులు, ఖర్గ్‌ ద్వీపాన్ని అమెరికా పూర్తిగా ధ్వంసం చేస్తుందని వార్నింగ్‌ ఇచ్చారు. స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసే డీశాలినేషన్‌ ప్లాంట్లను కూడా సర్వనాశం చేస్తామని హెచ్చరించారు. ఇరాన్‌ గత 47 ఏళ్ల ఉగ్ర పాలనలో వేలాది మంది అమెరికన్‌ సైనికుల ప్రాణాలు తీసింది. వారి మరణాలకు తాజా దాడులతో ప్రతీకారం తీర్చుకుంటామని ట్రంప్‌ వార్నింగ్‌ ఇచ్చారు. ఈ హెచ్చరికలతో ఇరాన్‎పై యుద్ధం విషయంలో ట్రంప్ వైఖరి దృఢంగా ఉందని స్పష్టం చేసింది.

ట్రంప్ హెచ్చరికలకు అంతే దీటు ఇరాన్!

ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అంతే దీటుగా బదులిచ్చింది. ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా కంపెనీలను టార్గెట్ చేసుకుంటోంది ఇరాన్‌. అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ, పారిశ్రామిక సంస్థలపై దాడులు చేస్తామని వార్నింగ్‌ ఇచ్చింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్, టెస్లా, బోయింగ్ వంటి 18 అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను ఇరాన్ తన హిట్ లిస్టులో చేర్చింది. ఈ కంపెనీల కార్యాలయాలు, యూనిట్లు తమ చట్టబద్ధమైన లక్ష్యాలని, వెంటనే ఉద్యోగులు అక్కడి నుండి ఖాళీ చేసి వెళ్లాలని ఐఆర్‌జీసీ హెచ్చరించడంతో అమెరికా టెక్ కంపెనీలకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

ప్రపంచ ఆర్థిక, సాంకేతిక రంగాలపై తీవ్ర ప్రభావం

మధ్యప్రాచ్యంలో చాలా టెక్ కంపెనీలకు పెద్ద స్థాయి కార్యకలాపాలు ఉన్నాయి. డేటా నిల్వ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ అనేక ప్రాంతీయ డేటా సెంటర్లు ఏర్పాటయ్యాయి. ఒకవేళ ఇరాన్ గనుక ఈ టెక్ కంపెనీల ప్రాంతీయ కార్యాలయాలపై దాడులు చేస్తే, అది కేవలం భౌతిక విధ్వంసానికే పరిమితం కాకుండా ప్రపంచ ఆర్థిక, సాంకేతిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అమెరికా ఏజెన్సీలు సేకరించే డేటాను ప్రాసెస్ చేసే ఏఐ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం ద్వారా అమెరికా సైనిక పటిష్టతను దెబ్బతీయాలన్నది ఇరాన్ ప్లాన్. అదే జరిగితే అమెరికా బ్యా్ంకింగ్‌ రంగం కూడా కుదేలైయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిణామాలతో ఇరాన్ యుద్దం తీవ్రస్థాయికి చేరుకునేలా కనిపిస్తోంది. దీంతో పశ్చిమాసియా పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us