
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబ్ పేల్చారు.. H1B వీసా ఫీజు ఏకంగా లక్ష డాలర్లకు పెంచేశారు. ఔను.. లక్ష డాలర్లు.. మన కరెన్సీలో దాదాపు 90 లక్షల రూపాయలు కడితేనే H1B ఇస్తారట..! అలాగే.. H1Bపై వచ్చేవారికి ఏటా కనీసం లక్ష డాలర్ల జీతం ఉండాలనే నిబంధన పెట్టారు. టెక్ కంపెనీలకు ఇది పిడుగు లాంటి వార్తే..! ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మన భారత్‌కు అమెరికా డోర్స్ క్లోజ్ చేసే ప్రయత్నం చేశారు ట్రంప్.. ఓ పక్క ట్రేడ్ డీల్ రచ్చ కొనసాగుతుండగానే H1Bపై నిర్ణయం తీసుకోవడం పెను సంచలనంగా మారింది.
హైలీ స్కిల్డ్ అయితేనే అమెరికాలో చోటు అన్నట్టుగా పాలసీ మార్చి ఇప్పుడు మన టెక్కీలపై దెబ్బకొట్టారు ట్రంప్. భారత్‌తోపాటు చైనాపై ఇప్పుడు ఈ వీసాల ప్రభావం దారుణంగా ఉండబోతోంది. అమెరికన్లను నియమించుకోండి.. అమెరికా ఫస్ట్ అంటూ ఒకటికి పదిసార్లు చెప్తున్న ట్రంప్.. H1B ఫీజు లక్ష డాలర్లకు పెంచడం ద్వారా తన ఉద్దేశం ఏంటో క్లియర్‌గానే బయటపెట్టేశారు.
ప్రస్తుతం H1Bకి లాటరీ విధానం అమల్లో ఉంది. ముందు వీసా కావాలనుకున్నవాళ్లు కొంత ఫీజ్ కడతారు. లాటరీలో పేరు ఫైనల్ అయితే.. అంటే లాటరీ తగిలితే డబ్బులు కట్టేవారు. ఇప్పుడిది తీసేశారు. గతంలో కంపెనీలు H1B లాటరీలో ఎంపికైన వాళ్ల ఫీజులు కట్టి.. ఆన్‌సైట్ ఆఫర్ ఇచ్చేవి. ఇప్పుడు లక్ష డాలర్లంటే IT ప్రొఫెషనల్స్‌ని US పంపే విషయంలో కంపెనీలు ఒకటికి 100 సార్లు ఆలోచిస్తాయి..! ఇక్కడ ఇంకో విషయం. US ఏటా 85వేల వీసాలు ఇలా లాటరీ ద్వారా ఇస్తూ ఉంటుంది. ఇప్పుడిది పోయి లక్ష డాలర్ల రేటు ఫిక్స్ అయ్యింది.
అమెరికన్లతో సాధ్యం కాని వర్క్ చేయించుకోవడానికి, అక్కడి కంపెనీలు హైలీ స్కిల్డ్ వాళ్లను తీసుకునేందుకే ఈ H1B విధానం ఉన్నది అంటూ చెప్తున్నారు US కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లూట్నిక్. భారత్ అంటే మామూలుగానే విషం కక్కే టైప్‌లో మాట్లాడే లూట్నిక్.. విదేశాల నుంచి ఉద్యోగులను తెచ్చుకుని అమెరికన్ల అవకాశాలు పోగొట్టకండి అంటూ కంపెనీలకూ హితవు పలుకుతున్నారు. మీడియా సమావేశంలో ట్రంప్ కంటే ఆయనే ఎక్కువగా మాట్లాడారు. ఎందుకింత కఠినతరం చేసిందీ చెప్పుకొచ్చారు.
#WATCH | President Donald J Trump signs an Executive Order to raise the fee that companies pay to sponsor H-1B applicants to $100,000.
White House staff secretary Will Scharf says, "One of the most abused visa systems is the H1-B non-immigrant visa programme. This is supposed to… pic.twitter.com/25LrI4KATn
— ANI (@ANI) September 19, 2025
H1B ఎప్పుడు మొదలైంది..?
1990లో ఈ H1B వీసా విధానం వచ్చింది. విదేశీ నిపుణులను హైర్ చేసుకోవడం కోసం ఈ వీసా విధానం తీసుకొచ్చారు. అమెరికాలోని టెక్ కంపెనీలు విదేశీ నిపుణులను హైర్ చేసుకోవడానికి ఇదో మార్గం. ఒకసారి H1B వీసా వస్తే దాని వ్యాలిడిటీ 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల వరకూ ఉంటుంది.
గతంలో ఓసారి ఈ H1B ఫీజులు ఎలా ఉన్నాయో చూస్తే..?
– 1998లో H1B ఫీజు – 500 డాలర్లు.
– 2000లో రూ. 1000 డాలర్లు.
– 2005లో రూ. 1500 డాలర్లు.
– 2010లో రూ. 2వేల డాలర్లు.
– 2015లో రూ. 4 వేల డాలర్లు
క్రమంగా ఈ ఫీజు పెరుగుతూనే వచ్చినా ఇప్పుడు రికార్డు బ్రేక్ చేశారు ట్రంప్. ఏకంగా H1B ఫీజు లక్ష డాలర్లు చేసేశారు. గతంలో ఏటా 60 వేల డాలర్లు జీతం ఉన్నా వాళ్లకి H1B ప్రాసెస్ చేసేవారు. ఇప్పుడు లక్ష డాలర్ల వార్షిక వేతనం ఉంటే తప్ప H1Bకి ఎలిజిబుల్ కాదు.. మొత్తంగా ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో భారతీయుల డాలర్ డ్రీమ్స్‌కి బ్యాండ్ పడినట్టే చెప్పుకోవాలి. దీనిపై తీవ్ర విమర్శలే వచ్చే అవకాశం ఉన్నా.. ట్రంప్ మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకునే స్థితిలో లేరు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..