
అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్.. ప్రాజెక్ట్ 2025 స్టార్ట్ చేశారు. ఈ మిషన్‌లో ట్రంప్ లక్ష్యం ఒక్కటే. వలసదారులను అమెరికా నుంచి వెళ్లగొట్టడం..! ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలనేది ట్రంప్ టార్గెట్. ఎందుకు అంత పట్టుదల అంటే… 2026లో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అది కూడా లాస్‌ఏంజిలిస్‌లో.. పైగా ఆ రాష్ట్రంలో విపక్ష పార్టీకే పట్టు ఎక్కువ. కారణం.. అక్రమ వలసదారులు ఎక్కువగా ఉండడం, వారికి ఓటు హక్కు ఉండడం ట్రంప్‌కి నచ్చలేదు. అందుకే, అక్రమ వలసదారులను ఏరిపారేయండని జూన్ 5న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చారు. దీంతో్ వెంటనే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారులు ఎంటర్ అయ్యారు. అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. మరోవైపు… లాస్‌ఏంజిలిస్ ఓటర్ల జాబితాలో రిజిస్ట్రేషన్లు పెగుతున్నాయి. జస్ట్ ఈ వారంలోనే 40 శాతం పెరుగుదల కనిపించింది. నేచురల్‌గానే కాలిఫోర్నియా స్టేట్ గవర్నర్‌కు ఎడ్జ్ ఉండే పాయింట్ ఇది. అందుకే, ట్రంప్ ఏకంగా నేషనల్ గార్డ్స్‌ను రంగంలోకి దింపి సైనికచర్యను తలపించే యాక్షన్ మొదలుపెట్టారు. ఇప్పుడిదీ.. స్టేట్ వర్సెస్ సెంట్రల్ అన్నట్టుగా తయారైంది. ఇది ఇక్కడితో ఆగేలా లేదు. అమెరికా మరింత తగలబడబోతోంది. మెజారిటీ రాష్ట్రాల్లో లాస్‌ఏంజిలిస్ సీన్స్ కనిపించబోతున్నాయి. అందుకే, అమ్మో.. అమెరికానే! అంటోంది ప్రపంచం. ఈ ఉద్రిక్తతల వేళ అమెరికా ఇంటెలిజెన్స్‌కు ఓ సిగ్నల్ అందింది. జూన్ 14వ తేదీన ఓ సర్‌ప్రైజ్ ప్రొటెస్ట్ జరగబోతోందని. ఇంతకీ ఎక్కడ? అసలే వీకెండ్. పైగా...