H1B Visa: అమెరికాలో ఉద్యోగం చేయడానికి అవసరమయ్యే హెచ్-1బీ వీసాపై భారీగా ఆశలు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా భారత్, చైనా నుంచి అమెరికాకు ఉద్యోగం కోసం వెళ్లిన వారికి హెచ్-1బీ వీసా కచ్చితంగా ఉండాలనే విషయం తెలిసిందే. అమెరికాకు చెందిన ఐటీ కంపెనీల్లో ఉద్యోగం పొందేందుకు వీలుగా ఈ వీసాలను జారీ చేస్తారు. ఈ క్రమంలోనే ఈ వీసాల కోసం ఎదురు చూస్తున్న విదేశీ ఐటీ నిపుణులకు యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) గుడ్ న్యూస్ చెప్పింది.
తిరస్కరణకు గురైన హెచ్1-బీ వీసా అప్లికేషన్లను తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారత ఐటీ నిపుణులుకు మరో అవకాశం దక్కింది. అయితే అక్టోబర్ 1, 2020 తర్వాత వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ అవకాశాన్ని కల్పించనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు గాను అక్టోబర్ 1 వరకు గడువు ఇచ్చారు. ఇక హెచ్-1బీ వీసాలను వినియోగించుకునే వారిలో భారతీయులు, చైనీయులే ఎక్కువగా ఉంటారు.
Also Read: Instagram: డెస్క్‌టాప్ నుంచి ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు.. ఎలా చేయాలో తెలుసా?
ఒకే కాన్పులో 10 మంది పిల్లలు.. సైకియాట్రిక్ వార్డులో చేరిన మహిళ.. వెలుగులోకి సంచలన విషయాలు!