కోవిడ్-19..భారత్ కు అమెరికా భారీ సాయం

| Edited By: Pardhasaradhi Peri

Mar 28, 2020 | 10:48 AM

కరోనాను ఎదుర్కొనేందుకు 64 దేశాలకు అమెరికా మొత్తం 174 మిలియన్ డాలర్ల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది. ఇందులో ఇండియాకు 2.9 మిలియన్ డాలర్ల సహాయం అందనుంది. ఇది గత ఫిబ్రవరిలో ప్రకటించిన 100 బిలియన్ డాలర్ల సాయానికి అదనం. ప్రస్తుతం 64 దేశాలు కరోనా సమస్యతో తీవ్రంగా సతమతమవుతున్నాయని, ఈ దేశాల్లో తగినన్ని వైద్య సాధనాలు గానీ నిపుణులు గానీ లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. లేబొరేటరీ వ్యవస్థలను సమకూర్చుకునేందుకు, ఇతర […]

కోవిడ్-19..భారత్ కు అమెరికా భారీ సాయం
Follow us on

కరోనాను ఎదుర్కొనేందుకు 64 దేశాలకు అమెరికా మొత్తం 174 మిలియన్ డాలర్ల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది. ఇందులో ఇండియాకు 2.9 మిలియన్ డాలర్ల సహాయం అందనుంది. ఇది గత ఫిబ్రవరిలో ప్రకటించిన 100 బిలియన్ డాలర్ల సాయానికి అదనం. ప్రస్తుతం 64 దేశాలు కరోనా సమస్యతో తీవ్రంగా సతమతమవుతున్నాయని, ఈ దేశాల్లో తగినన్ని వైద్య సాధనాలు గానీ నిపుణులు గానీ లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. లేబొరేటరీ వ్యవస్థలను సమకూర్చుకునేందుకు, ఇతర అవసరాలకు ఇండియాతో బాటు ఈ దేశాలు ఆర్ధిక సహాయాన్ని వినియోగించుకోవాలని ఈ శాఖ కోరింది.

గ్లోబల్ హెల్త్ లీడర్ షిప్ అన్నదే తమ ధ్యేయమని అక్కడి అంతర్జాతీయ అభివృధ్ది సంస్థ డైరెక్టర్ బోనీ గ్లిక్ తెలిపారు. ‘కోవిడ్-19 యాక్షన్ ప్లాన్ కింద ఈ సహాయాన్ని తమ దేశం ప్రకటించిందన్నారు. కాగా శ్రీలంకకు 1.3 మిలియన్ డాలర్లు, నేపాల్ కు 1.8 మిలియన్లు, బంగ్లాదేశ్ కు 3.4, ఆఫ్ఘనిస్థాన్ కు 5 మిలియన్ డాలర్ల ఆర్ధిక సాయం లభించనుంది. ఓ వైపు తమ దేశంలో కరోనా బాధితుల మరణాలు, కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ, అమెరికా ఇలా ఇతర దేశాలకు  భారీ ఆర్ధిక సహాయం ప్రకటించడం విశేషం. ఇఇందుకు ఆ దేశానికి ఇండియా కృతజ్ఞతలు తెలిపింది.