China vs America: చైనా హెచ్చరికలను ఖాతరు చేయని అమెరికా.. తైవాన్ విషయంలో సంచలన ప్రకటన..

China vs America: తైవాన్ విషయంలో చైనా చేస్తున్న హెచ్చరికలను అగ్రరాజ్యం అమెరికా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. డ్రాగన్ వార్నింగ్స్‌ను పూచికపుల్లల్లా తీసిపడేస్తోంది.

China vs America: చైనా హెచ్చరికలను ఖాతరు చేయని అమెరికా.. తైవాన్ విషయంలో సంచలన ప్రకటన..
Us Taiwan

Updated on: Sep 03, 2022 | 4:49 PM

China vs America: తైవాన్ విషయంలో చైనా చేస్తున్న హెచ్చరికలను అగ్రరాజ్యం అమెరికా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. డ్రాగన్ వార్నింగ్స్‌ను పూచికపుల్లల్లా తీసిపడేస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా సంచలన ప్రకటన చేసింది. ఎవరూ ఊహించని విధంగా తైవాన్‌కు భారీ సాయం ప్రకటించింది అగ్రరాజ్యం. 1.1 బిలియన్ యూఎస్ డాలర్ల ప్యాకేజీని తైవాన్‌కు అందించనున్నట్లు స్పష్టం చేసింది అమెరికా. తైవాన్‌ సైన్యం ఆధునికీకరణ కోసం ఆర్థిక ప్యాకేజీ అందిస్తున్నట్టు చెబుతోంది అమెరికా.

అయితే, చైనా నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు వీలుగా ఈ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. తైవాన్‌పై చైనా ఏ క్షణమైనా దాడికి దిగొచ్చన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అమెరికా ఆర్థిక సాయం ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక అమెరికా చర్యలు తమను రెచ్చగొట్టేలా ఉన్నాయంటోంది చైనా.

ఇదిలాఉంటే.. ఇటీవలకాలంలో చైనాకు గట్టిగా బదులిస్తోంది తైవాన్‌. డ్రాగన్‌తో ఢీ అంటే ఢీ అంటోంది. మొన్నటికి మొన్న షియూ ఐలాండ్‌లోకి చొచ్చుకొచ్చిన సివిలియన్‌ డ్రోన్‌ను పడగొట్టింది తైవాన్‌. చైనీస్‌ కోస్ట్‌ నుంచి పరిధి దాటి వచ్చిన డ్రోన్‌ను పసిగట్టిన తైవాన్‌ మిలిటరీ వెంటనే అప్రమత్తమైంది. డ్రోన్‌పై ఫోకస్‌ పెట్టిన మిలిటరీ.. నేలకూల్చింది. దీనిని గుర్తు తెలియని డ్రోన్‌గా చెబుతోంది తైవాన్‌. చైనా వైపు నుంచే రావడంతో డ్రాగన్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరోవైపు అమెరికా సెనేట్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌‌లో పర్యటించడంపై మండిపడుతోంది చైనా. అటు తైవాన్‌తో పాటు అమెరికాపైనా కన్నెర్ర చేస్తోంది డ్రాగన్‌ దేశం. చైనా ఆందోళన, వ్యతిరేకతను లెక్క చేయకుండా తైవాన్‌లో పర్యటించారు పెలోసీ. అప్పటి నుంచీ తైవాన్‌ను రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది చైనా. మిలిటరీ విన్యాసాలతో భయభ్రాంతులకు గురిచేస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..