ఫ్లైట్ జెర్నీ… ఢిల్లీ చికాగో మధ్య నాన్ స్టాప్ విమాన సర్వీసు… త్వరలో బెంగళూరు నుంచి కూడా…

యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఢిల్లీ నుంచి చికాగో మధ్య నాన్ స్టాప్ విమాన సర్వీసును ప్రారంభించింది. ఈ సర్వీసు న్యూయార్క్, సాన్ ఫ్రాన్సిస్కోల మీదుగా ప్రయాణించనుంది.

  • Tv9 Telugu
  • Publish Date - 7:00 pm, Sun, 13 December 20
ఫ్లైట్ జెర్నీ... ఢిల్లీ చికాగో మధ్య నాన్ స్టాప్ విమాన సర్వీసు... త్వరలో బెంగళూరు నుంచి కూడా...

యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఢిల్లీ నుంచి చికాగో మధ్య నాన్ స్టాప్ విమాన సర్వీసును ప్రారంభించింది. ఈ సర్వీసు న్యూయార్క్, సాన్ ఫ్రాన్సిస్కోల మీదుగా ప్రయాణించనుంది. త్వరలో బెంగళూరు, సాన్ ఫ్రాన్సిస్కో మధ్య విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు సైతం తెలిపారు. బోయింగ్ 787 విమానాన్ని ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నట్లు యునైటెడ్ కంట్రీ మేనేజర్ హర్విందర్ సింగ్ తెలిపారు.

 

చికాగో, ఢిల్లీ సర్వీసును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. నూతన సర్వీసు ప్రారంభం సంతోషాన్నిస్తోందని తెలిపారు. ఢిల్లీ, చికాగో విమాన సర్వీసుల కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. నాన్ స్టాప్ సర్వీసు కారణంగా ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా హాయిగా ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చని పేర్కొన్నారు. బిజినెస్ క్లాస్ ప్రయాణికుల సౌకర్యార్థం పడుకుని ప్రయాణించే వెసులుబాటును కల్పించినట్లు ఆయన తెలిపారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ సీఈఓ విదేశ్ కుమార్ మాట్లాడుతూ… యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఢిల్లీ, చికాగో మధ్య విమాన సర్వీసును నడపడం సంతోషమని అన్నారు. నాన్ స్టాప్ ప్రయాణం ప్రయాణికులు, వ్యాపారవేత్తలకు బాగా ఉపయోగపడుతుందని అన్నారు.