ఇతన్ని అదృష్టానికే బ్రాండ్ అంబాసిడర్ అనాలేమో.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 160 లాటరీ టికెట్లు..
ఇతన్ని అదృష్టానికే బ్రాండ్ అంబాసిడర్ అనాలేమో. అంతలా అతన్ని అదృష్టం వరించింది మరి. సాధారణంగా కొన్ని లాటరీ టెకెట్లు కొన్న ఆశావహులు.. వాటిలో ఒక్కటైనా తమకు తగలకపోతుందా అనే ఆశతో ఎదురు చూస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా..
ఇతన్ని అదృష్టానికే బ్రాండ్ అంబాసిడర్ అనాలేమో. అంతలా అతన్ని అదృష్టం వరించింది మరి. సాధారణంగా కొన్ని లాటరీ టెకెట్లు కొన్న ఆశావహులు.. వాటిలో ఒక్కటైనా తమకు తగలకపోతుందా అనే ఆశతో ఎదురు చూస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా అతను కొన్న 160 లాటీరీ టికెట్లకు జాక్‌పాట్ తగిలింది. కొన్న ప్రతీ టికెట్‌లోనూ అతన్ని అదృష్టం వరించింది. వివరాల్లోకెళితే.. అమెరికాలోని వర్జీనియాకు చెందిన క్వామే క్రాప్ 160 లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు. 1,3,4,7 అంకెల కాంబినేషన్‌లో ఉన్న లాటరీ టికెట్లనే కొన్నాడు. అయితే అతను కొన్ని ప్రతి టికెట్‌కు బహుమతి లభించింది. దీంతో తొలుత అతను షాక్‌కు గురై.. ఇది నిజమేనా అని ఒకటికి పదిసార్లు పరిశీలించాడట. చివరికి అది నిజమే అని తేలడంతో క్రాప్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మొత్తం 160 టికెట్లకు గానూ 8 లక్షల డాలర్లు(భారత కరెన్సీలో రూ.5.89 కోట్లు) క్రాప్ గెలుచుకున్నాడు. దీనికి ముందు 160 లాటరీల్లో ఒక్కటైనా తగలకపోదా అని అనుకున్నాడట క్రాప్. ఒకవేళ లాటరీ తగిలితే చిన్నపాటి ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ పెట్టుకుందామని ప్లాన్ వేసుకున్నాడట. మరి ఇప్పుడు ఏకంగా రూ.5.89 కోట్లు గెలవడంతో అతను సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఆ డబ్బుతో ఏం చేయాలనేదానిపై ఇంకా నిర్ణయించుకోలేదని క్రాప్ చెప్పుకొచ్చాడు.