ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన అనుమానాస్పద బ్యాగ్.. ఏముందోనని తెరిచి చూడగా మైండ్ బ్లాంక్!

|

Feb 07, 2023 | 7:46 AM

ఓ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు ఎప్పటిలానే లగేజీని రొటీన్ ఎక్స్-రే స్కానింగ్ చేస్తుండగా.. వారికి ఓ అనుమానాస్పద బ్యాగ్ కనిపించింది..

ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన అనుమానాస్పద బ్యాగ్.. ఏముందోనని తెరిచి చూడగా మైండ్ బ్లాంక్!
Representative Image
Follow us on

ఓ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు ఎప్పటిలానే లగేజీని రొటీన్ ఎక్స్-రే స్కానింగ్ చేస్తుండగా.. వారికి ఓ అనుమానాస్పద బ్యాగ్ కనిపించింది. దానిని స్కాన్‌ చేయగా అందులో పుర్రె లాంటి వస్తువు ఉందని తేలింది. వారికి డౌట్ వచ్చి ఆ బ్యాగ్ ఓపెన్ చేయగా.. అంతే! అందులో ఉన్న దాన్ని చూసి ఒక్కసారిగా అధికారుల మైండ్ బ్లాంక్ అయింది. ఇంతకీ అసలు స్టోరీ ఏంటంటే.?

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని డిట్రాయిట్ విమానాశ్రయంలో డాల్ఫిన్ పుర్రెతో ఉన్న బ్యాగ్ లభ్యమైంది. అక్కడ ఉన్న సిబ్బంది తనిఖీలు చేస్తుండగా.. మొదట అందులో ఏదో పుర్రె లాంటి వస్తువు ఉందని గుర్తించారు. అయితే ఆ తర్వాత వైల్డ్‌లైఫ్ అధికారులు అక్కడికి చేరుకొని క్షుణ్ణంగా పరిశీలించడంతో అది ఒక డాల్ఫిన్ పుర్రె అని నిర్ధారణమైంది. దీనిని అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నించి.. పట్టుబడిపోతాననే భయంతో బహుశా ఈ బ్యాగ్‌ను యజమాని ఇక్కడే వదిలేసి తప్పించుకుని పారిపోయి ఉండొచ్చునని యూఎస్ కస్టమ్స్ అధికారులు భావిస్తున్నారు. తదుపరి విచారణ నిమిత్తం డాల్ఫిన్ పుర్రెను వైల్డ్‌లైఫ్ సిబ్బందికి అప్పగించామని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడింది ఎవరైనా కూడా పట్టుకుంటామని స్పష్టం చేశారు.

కాగా, ‘వన్యప్రాణులను అక్రమ రవాణా చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తాం. వన్యప్రాణులు, వాటి ఆవాసాలను రక్షించడానికి యూఎస్ ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ అధికారులతో కలిసి పని చేస్తాం’ అని  కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ రాబర్ట్ లార్కిన్ వెల్లడించారు.