PM Modi: ప్రధాని మోదీకి లేఖ రాసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. ఇంకా లేఖలో ఏం చెప్పారంటే

రష్యా దాడులతో ఉక్రెయిన్ ఇంకా సంక్షోభంలోనే కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. తమకు ఔషధాలు, వైద్య పరికరాలతో పాటు అదనపు మానవతా సాయం చేయాలని అభ్యర్థించారు.

PM Modi: ప్రధాని మోదీకి లేఖ రాసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. ఇంకా లేఖలో ఏం చెప్పారంటే
Pm Modi And Zelensky

Updated on: Apr 12, 2023 | 1:47 PM

రష్యా దాడులతో ఉక్రెయిన్ ఇంకా సంక్షోభంలోనే కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. తమకు ఔషధాలు, వైద్య పరికరాలతో పాటు అదనపు మానవతా సాయం చేయాలని అభ్యర్థించారు. అలాగే ఉక్రెయిన్‌లోని మౌళిక సదుపాయల పునర్నిర్మాణానికి భారత కంపెనీలకు అవకాశంగా ఉంటుందని సూచించారు. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న ఉక్రెయిన్ విదేశాంగ ఉప మంత్రి ఎమినీ జపరోవా..జెలెన్‌స్కీ రాసిన లేఖను మనదేశ విదేశాంగ సహాయ మంత్రి మీనాక్షి లేఖికి అందజేశారు. అయితే ఉక్రెయిన్‌కు సహాయం చేసేందుకు భారత్ ముందుకొచ్చిందని సహాయ మంత్రి మీనాక్షి లేఖిని ట్విట్టర్‌లో స్పందించారు.

ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలైనప్పుడు తమ సొంత దేశాలకు వెళ్లిపోయిన వైద్య విద్యార్థులు ఇప్పుడు అక్కడే యూనిఫైడ్ స్టేట్ క్వాలిఫికేషన్ పరీక్షను రాసుకోవచ్చని ఉక్రెయిన్ మంత్రి ఎమినీ జపరోవా పేర్కొన్నారు. అలాగే రష్యాతో యుద్ధం సమస్యను పరిష్కరించేందుకు భారత్ మరింత కీలక పాత్ర పోషించాలని.. ప్రధాని మోదీ, ఇతర ఉన్నతాధికారులు ఉక్రెయిన్ కు రావాలని కోరారు. ఇతర దేశాలతో భారత్‌కున్న సంబంధాల విషయంలో సూచనలు చేసే స్థితిలో తమ దేశంలేదన్నారు. అలాగే ఆమె భారత్‌ను ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనే విశ్వగురువుగా ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..