Russia – Ukraine War: ఉక్రెయిన్ వాసులకు ఆత్మరక్షణ కవచంలా నిలిచింది ఓ ఆయుధం. దాంతో ఉక్రెయిన్‌లో ఆ ఆయుధాన్ని దేవదూతతో పోలుస్తున్నారు. అదే ‘జావెలిన్’ ఏటీజీఎం యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్..! భుజం మీద నుంచి గురిపెట్టి ప్రయోగించే ఈ ఆయుధానికి ఉక్రెయిన్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.. దీనిని ఏకంగా ‘సెయింట్ జావెలిన్’ అని పిలుస్తున్నారు. ఉక్రెయిన్ తల్లిదండ్రులు ఈ ఆయుధానికి కృతజ్ఞతగా తమ పిల్లలకు ‘జావెలిన్’,‘జావెలినా’ అనే పేర్లు పెడుతున్నారు. తాజాగా అమెరికా మరో 5 వేల జావెలిన్లను ఉక్రెయిన్ తరలిస్తోంది. ఈ చిన్న ఆయుధం ఉక్రెయిన్ వాసులను అంతలా కాపాడుతోంది. దీని నుంచి తప్పుకోవడానికి రష్యా అష్టకష్టాలు పడుతోంది.
కాగా కెనడాకు చెందిన క్రిస్టియన్ బోరిస్ ‘సెయింట్ జావెలిన్’ పేరిట ఓ చిత్రాన్ని సిద్ధం చేశారు. దీనిలో ఒక దేవదూత జావెలిన్ క్షిపణిని పట్టుకొని కనిపిస్తుంది. ఆ తర్వాత ఇదే బొమ్మ ఉన్న వివిధ రకాల వస్తువుల అమ్మకాలతో మిలియన్ డాలర్లు సమీకరించారు. ఉక్రెయిన్ సేవా కార్యక్రమాలకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు.