రష్యా వైమానిక స్థావరంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. 40 విమానాలను ధ్వంసం..!

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధభూమి మళ్లీ ఎరుపెక్కింది. రెండు దేశాల మధ్య పరస్పరం దాడులు కంటిన్యూ అవుతున్నాయి. ఇటీవలే ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసిన రష్యా.. ఇప్పుడు ఆ తాకిడి మరింత పెంచేసింది. దీనికి ప్రతీకారంగా మునుపెన్నడూ లేని విధంగా రష్యాపై తెగబడింది ఉక్రెయిన్.

రష్యా వైమానిక స్థావరంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. 40 విమానాలను ధ్వంసం..!
Ukraine Drone Attack On Russian Airbase

Updated on: Jun 01, 2025 | 8:54 PM

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధభూమి మళ్లీ ఎరుపెక్కింది. రెండు దేశాల మధ్య పరస్పరం దాడులు కంటిన్యూ అవుతున్నాయి. ఇటీవలే ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసిన రష్యా.. ఇప్పుడు ఆ తాకిడి మరింత పెంచేసింది. దీనికి ప్రతీకారంగా మునుపెన్నడూ లేని విధంగా రష్యాపై తెగబడింది ఉక్రెయిన్. ఏకంగా 40 డ్రోన్లు, క్షిపణులతో రష్యా వైమానిక స్థావరంపై దాడి చేయడంతో అల్లాడిపోయింది.

రష్యాలోని సైబీరియాలోని సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ అతిపెద్ద డ్రోన్ దాడి చేసింది. కనీసం 40 రష్యన్ విమానాలపై ఉక్రెయిన్ డ్రోన్లు దాడి చేశాయి. ఇర్కుట్స్‌కా ప్రాంత రష్యా గవర్నర్ ఈ దాడిని ధృవీకరించారు. ఉక్రేనియన్ రిమోట్-పైలట్ విమానం స్రెడిని గ్రామంలోని సైనిక యూనిట్‌పై దాడి చేసిందని, ఇది సైబీరియాలో ఇదే మొదటి దాడి అని ఆయన అన్నారు. ఇప్పటివరకు రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద డ్రోన్ దాడి ఇదే అని తెలిపారు.

వీడియో చూడండి.. 

ఉక్రెయిన్ భద్రతా సేవ (SBU) నిర్వహించిన ఆపరేషన్‌లో రష్యన్ ఫెడరేషన్ వెనుక ఉన్న వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 40కి పైగా రష్యన్ విమానాలు దాడి చేశాయని ఉక్రెయిన్ మీడియా పేర్కొంది. ఇందులో ఒలెన్యా, బెలయా విమానాశ్రయాలు కూడా ఉన్నాయి.

ఇదిలావుంటే, ఇటీవలఉక్రెయిన్‌లోని 30 నగరాల్లో రష్యా దాడులు జరిగాయి. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. 12 మంది మృతిచెందారు. వందలాది మంది గాయపడ్డారు. టోటల్‌గా మూడు రోజుల్లో 900 డ్రోన్‌ దాడులతో విరుచుకుపడింది రష్యా. కేవలం 4 గంటల్లోనే 95 ఉక్రేనియన్ డ్రోన్‌లను కూల్చివేసినట్లు చెబుతోంది రష్యా. మూడేళ్లుగా యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఈ స్థాయిలో డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడ్డం ఎప్పుడూ లేదు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ఆర్మీ వర్గాలే ఒప్పుకున్నాయి.

ఇప్పుడు జరిగేవన్నీ సామాన్య జనమే లక్ష్యంగా ఉద్దేశపూర్వక దాడులే అని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంటున్నారు. ఇంతకు తెగించిన రష్యాపై ఆంక్షలు విధించాలని పాశ్చాత్య దేశాలను అభ్యర్థించారు. రష్యా నాయకత్వంపై బలమైన ఒత్తిడి తీసుకువస్తే తప్ప దారుణాలకు అడ్డుకట్ట వేయలేమన్నారు. అమెరికా సహా ప్రపంచ దేశాల నిశ్శబ్దం పుతిన్‌ను ప్రోత్సాహిస్తోందనేది ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఆందోళన. అగ్నిగోళంలా మారుతున్న ఉక్రెయిన్‌ గురించి ప్రపంచం ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..