America: ఖతర్నాక్ ప్లాన్.. ఆఖరికి జుట్టును కూడా దానికోసం వాడేశారు.. కానీ, బ్యాడ్‌ లక్.. దెబ్బకు దెయ్యం వదిలింది..

|

Nov 15, 2022 | 2:09 PM

కాలం మారుతున్నా కొద్ది కేటుగాళ్లు మరింత రాటుదేలుతున్నారు. ముఖ్యంగా స్మగ్లర్లు అయితే మరీ రెచ్చిపోతున్నారు. సందు చేసుకుని మరీ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు.

America: ఖతర్నాక్ ప్లాన్.. ఆఖరికి జుట్టును కూడా దానికోసం వాడేశారు.. కానీ, బ్యాడ్‌ లక్.. దెబ్బకు దెయ్యం వదిలింది..
Drugs
Follow us on

కాలం మారుతున్నా కొద్ది కేటుగాళ్లు మరింత రాటుదేలుతున్నారు. ముఖ్యంగా స్మగ్లర్లు అయితే మరీ రెచ్చిపోతున్నారు. సందు చేసుకుని మరీ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. అక్కడా, ఇక్కడా అనే కన్‌ఫ్యూజన్ లేకుండా.. ఎలా వీలైతే అలా పని పూర్తి చేస్తున్నారు. కస్టమ్స్ అధికారులు ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకుంటున్నా.. డ్రగ్స్, బంగారం, ఇతరత్రా అక్రమ రవాణాకు పాల్పడుతూనే ఉన్నారు. కాదేదీ స్మగ్లింగ్‌ చేయడానికి అనర్హం అన్న రేంజ్‌లో.. దుస్తులు, చెప్పులు, బ్యాంగులు, అండర్ వేర్‌లు, ఆఖరికి శరీరంలోనూ పెట్టుకుని డ్రగ్స్, బంగారం అక్రమ రవాణా చేస్తున్నారు.

అయితే, తాజాగా దొరికిపోయిన ఇద్దరు స్మగ్లర్లు డ్రగ్స్‌ను దాచిపెట్టిన విధానం చూసి నోరెళ్లబెట్టారు కస్టమ్స్ అధికారులు. అన్నీ అయిపోయాయి ఇక మిగిలింది అదొక్కటే అన్నట్లుగా.. ఇద్దరు మహిళలు తమ జుట్టులో కొకైన్‌ను దాచిపెట్టి అక్రమంగా రవాణా చేసే ప్రయత్నం చేశారు. అయితే, వారి బ్యాడ్‌ లక్.. ఎయిర్‌పోర్ట్ అధికారుల ముందు వారి జిత్తులు నడవలేదు. అడ్డంగా బుక్కైపోయారు. వారి జుట్టు చిత్ర విచిత్రంగా ఉండటం, వారి ప్రవర్తనలో తేడా కొట్టడంతో పక్కకు పిలిచి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే వస్తువులు బయటపడ్డాయి. పొదల మాదిరిగా అలంకరణ చేసుకున్న జుట్టులో కొకైన్‌ను దాచిపెట్టారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 2 కిలోల కొకైన్ ఫౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. కొలింబియాలో ఎయిర్‌పోర్ట్ అధికారులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. అమెరికాలోని రెండు వేరు వేరు విమానాశ్రయాల్లో ఈ ఇద్దరు మహిళా ప్రయాణికు ఒకే విధమైన ప్లాన్‌ వేసి పట్టుబడ్డారు. వీరిద్దరూ స్పెయిన్‌లోని మాడ్రిడ్‌కు బయలుదేరినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

ఈ ఇద్దరు మహిళా ప్రయాణికులను బాడీ స్కానింగ్ చేయగా.. వారి తన వెంట్రుకలలో వింత వస్తువులు కనిపించాయని, చెక్ చేయగా.. నల్లటి బ్యూబ్‌లలో అమర్చిన కొకైన్ బయటపడిందని తెలిపారు అధికారులు. వీరిని అదుపులోకుని విచారిస్తున్నట్లు కొలంబియా అధికారులు ప్రకటించారు. ఇరువురి వద్ద నుంచి రూ. 2 కిలోల ఫౌడర్ వైట్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..