పాకిస్తాన్ ప్రావిన్స్‌లోని బలూచిస్తాన్ (Balochistan )రక్తసిక్తమైంది. రెండు మిలటరీ బేస్‌లను లక్ష్యంగా చేసుకొని బలూచిస్తాన్‌లోని వేర్పాటువాద తిరుగుబాటుదారులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. పంజూర్, నోష్కీ పోస్టులపై రెండు ఆత్మాహుతిదాడులు జరిగాయి. ఈ ఒక్కో దాడిలో ఆరుగురు సూసైడ్ బాంబర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ దాడుల్లో వందల మంది పాక్‌సైనికులు మరణించినట్లు సమాచారం. కాగా, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్( Prime Minister Imran Khan) చైనా(China) పర్యటనకు ముందు ఈ దాడులు జరగడం పాక్ ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వింటర్ ఒలింపిక్ క్రీడల ప్రారంభానికి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. సైనికుల ప్రాణ త్యాగాలను కొనియాడారు. సైన్యానికి దేశం అండగా ఉంటుందని ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఉగ్రవాద దాడులను తిప్పికొట్టిన భద్రతా బలగాలకు సెల్యూట్ చేస్తున్నాం అని ఇమ్రాన్ ఖాన్ గురువారం ఒక ప్రకటనలో చెప్పారు.
బలూచిస్థాన్‌లో పంజగుర్, నౌష్కి సైనిక స్థావరాలపై ఉగ్రవాదులు దాడులు జరిపారు. ఉగ్రదాడులను పాక్ సైన్యం ప్రతిఘటించిందని పాక్ అంతర్గ వ్యవహారాల మంత్రి షేక్ రషీద్ అహ్మద్ తెలిపారు. దాడులకు బాధ్యత వహిస్తున్నట్లు నిషేధిత బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ప్రకటించింది. సైనిక స్థావరాలలోకి చొరబాటుకు ప్రయత్నించినట్లు పేర్కొంది. తమ ఆత్మాహుతి బాంబర్లు సైనిక స్థావరాల ప్రవేశద్వారం వద్ద పేలుడు పదార్థాలతో ఉన్న వాహనాలను పేల్చడంతో 50 మందికి పైగా సైనికులు మరణించారని తెలిపింది.
గత వారం, తిరుగుబాటుదారులు అరేబియా సముద్రంలోని గ్వాదర్ ఓడరేవు సమీపంలోని పోస్ట్‌పై దాడి చేసి 10 మంది సైనికులను హతమార్చారు, ఇది సంవత్సరాలలో బలూచిస్తాన్ తిరుగుబాటుతో పాక్ సైన్యానికి భారీ ప్రాణనష్టం సంభించిందంటూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: US Winter Storm: అమెరికాలో భారీ మంచు తుఫాన్.. 8 వేల విమానాలు రద్దు.. కొన్ని ప్రాంతాలకు తుఫాన్ హెచ్చరికలు జారీ..