US Winter Storm: అమెరికాలో భారీ మంచు తుఫాన్.. 8 వేల విమానాలు రద్దు.. కొన్ని ప్రాంతాలకు తుఫాన్ హెచ్చరికలు జారీ..
US Winter Storm: అమెరికా(America)లోని దక్షిణ ప్రాంతాల్లో భారీ హిమపాతం(Snowfall), మంచుతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణంలో..
US Winter Storm: అమెరికా(America)లోని దక్షిణ ప్రాంతాల్లో భారీ హిమపాతం(Snowfall), మంచుతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణంలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల కారణంగా పలు ఎయిర్ పోర్టులు వేలాది విమానాలను రద్దు చేశాయి. ప్రస్తుతం మంచు తుఫాన్ ను నుంచి ఉపశమనం లభించే అవకాశం లేనందున ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రోడ్లకు రావాలని.. పాఠశాల క్యాంపస్‌లను మూసివేయాలని అధికారులు కోరారు. మంగళవారం నుంచే తీవ్ర చలి గాలులు వీయడంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి. న్యూ మెక్సికో , కొలరాడో, మెయిన్ రాష్ట్రాలకు మంచు తుఫాను హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. బుధవారం ఉదయం ఓక్లహోమా, కాన్సాస్, మిస్సోరి, ఇల్లినాయిస్, ఇండియానా , మిచిగాన్‌లలో వర్షం, వడగళ్ళు, భారీ హిమపాతం చోటు చేసుకుంది.
బుధవారం నుంచి చాలా ప్రాంతాల్లో విపరీతమైన మంచు కురుస్తోంది. దీంతో ఒక అడుగుమేర మంచు పేరుకుంది. సెంట్రల్ ఇల్లినాయిస్ నగరం లెవిస్టన్‌లో 14.4 అంగుళాల (36.6 సెం.మీ.) మంచు కురిసింది. ఈశాన్య మిస్సౌరీలోని హన్నిబాల్ నగరంలో 11.5 అంగుళాల (29.2 సెం.మీ.) మంచు కురిసింది. ఈ ప్రాంతాల్లో ఇంకా మంచు కురవనుందని మేరీల్యాండ్‌లోని నేషనల్ వెదర్ సర్వీస్‌కు చెందిన వాతావరణ శాస్త్రవేత్త ఆండ్రూ ఒరిసన్ చెప్పారు. సెంట్రల్ ఇల్లినాయిస్, ఉత్తర ఇండియానాలో గురువారం చివరి నాటికి 12 నుండి 18 అంగుళాలు (30 నుండి 45 సెం.మీ.) వరకు మంచు కురిసే అవకాశం ఉందని ఒరిసన్ చెప్పారు. మిస్సోరిలో మధ్యాహ్నానికి మంచు తగ్గుముఖం పట్టింది. కానీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో 8 అంగుళాల నుండి ఒక అడుగు (20 నుండి 30 సెం.మీ.) వరకు మంచు కురుస్తుంది.
దక్షిణ ప్రాంతాలకు మంచు తుఫాన్ హెచ్చరిక మిచిగాన్‌లోని కొన్ని ప్రాంతాలలో గురువారం వరకు దాదాపు ఒక అడుగు మేర మంచు కూడా పడవచ్చు నని అధికారులు హెచ్చరించారు. సెంట్రల్ మిస్సౌరీలో, అధికారులు రహదారిని మూసివేశారు. అమెరికాలోని దక్షిణ ప్రాంతాలలో భారీ హిమపాతం , మంచు వర్షం కురుస్తుంది. కెంటకీలోని లూయిస్‌విల్లే నుండి టేనస్సీలోని మెంఫిస్ వరకు దిగువ ఒహియో వ్యాలీ ప్రాంతంలో అత్యంత భారీ మంచు కురవనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కెంటకీ లోని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయాలని గవర్నర్ ఆండీ బెషీర్ గురువారం ఆదేశించారు. ఇప్పుడున్న పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా ప్రమాదకరమని ఆయన అన్నారు. ఇందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు.
ఎనిమిది వేల విమానాలు రద్దు ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ FlightAware.com బుధ, గురువారాల్లో సుమారు ఎనిమిది వేల విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది. ప్రతికూల వాతావరణం కారణంగా సెయింట్ లూయిస్, చికాగో, కాన్సాస్ సిటీ , డెట్రాయిట్‌లోని విమానాశ్రయాలు సాధారణం కంటే ఎక్కువ విమానాలను రద్దు చేశాయి. గురువారం ఒక్కరోజే, డల్లాస్-ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు 700 విమానాలు, డల్లాస్ లవ్ ఫీల్డ్‌లో 300 కంటే ఎక్కువ విమానాలు రద్దు చేశారు. బుధవారం సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ సెయింట్ లూయిస్ లాంబెర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో , గురువారం డల్లాస్ లవ్ ఫీల్డ్ హబ్‌లో అన్ని విమాన కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని అధికారులు ప్రకటించారు
Also Read: ఆ దేశంలో కోవిడ్ రూల్స్ సడలింపు.. కరోనా పాజిటివ్ వచ్చినా ఐసోలేషన్ అవసరం లేదన్న ప్రభుత్వం..