Turkey Earthquake: సిరియాలో హృదయ విదారక ఘటన.. భూకంప శిథిలాల కింద బిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలు విడిచిన తల్లి

|

Feb 07, 2023 | 11:36 AM

శిథిలాల కిందే.. తల్లి ఓ పండంటి బిడ్డను ప్రసవించింది. అయితే దురదృష్టం కొద్దీ ప్రసవించిన వెంటనే చిన్నారిని కనులారా చూడక ముందే ఆ తల్లి కన్నుమూసింది.

Turkey Earthquake: సిరియాలో హృదయ విదారక ఘటన.. భూకంప శిథిలాల కింద బిడ్డకు జన్మనిచ్చి ప్రాణాలు విడిచిన తల్లి
Earthquake In Aleppo
Follow us on

సృష్టిలో ప్రతి జీవికి మరణం తథ్యం.. ఇంకా చెప్పాలంటే.. అంబరాన్ని తాకినా..సముద్రం లోతులు కొలిచినా మనిషి చావు పుట్టులకు ఎవరి చేతుల్లోనూ లేవు.. ఇదే విషయం అనేక సార్లు ప్రకృతి మనిషికి తుపాన్, సునామీ, భూకంపం వంటి వైపరీత్యాలతో తెలియజేస్తూ ఉంటుంది. ప్రకృతి ప్రకోపంతో టర్కీ, సిరియా దేశాల్లో రక్తమోడుతోంది. ప్రకృతి కన్నెర జేస్తే ఫలితం ఎలా ఉంటుందో తాజా భూకంపాలను చూస్తే అర్ధమవుతుంది. శిధిలాల కింద వేలాది మృత దేహాలు బయటపడుతున్నాయి. అయితే.. లయకారుడి తాండవంతో సృష్టి వినాశనానికి మాత్రమే కాదు చావుపుట్టుకలకి కూడా కారణమని ప్రతీతి. అందునా కష్టకాలంలోనూ వెలుగు రేఖను ప్రసరించే ప్రయత్నం చేశాడేమో!. ఓవైపు పుట్టుక అదే సమయంలో మరోవైపు మరణం సంభవించింది. శిథిలాల కిందే బిడ్డను ప్రసవించి కన్నుమూసిందో కన్నతల్లి.

ఓ వైపు వరసగా కంపిస్తున్న భూమి.. మరోవైపు శిథిలాల్లో చిక్కుకున్న మనుషులు.. ఇంకొక వైపు భూకంపం నుంచి ప్రాణాలతో భయపడిన బాధితులు… మంచు కురుస్తూ ఉండడంతో చలికి వణికిపోతూ చేతికి దొరికిన పేపర్లను, అట్ట ముక్కలను, కవర్లను కాల్చుతూ చలి మంట కాచుకుంటున్నారు. టర్కీ, సిరియాలో ఎటు చూసినా కుప్ప కూలిన భవనాలు.. శిధిలాల మధ్య అహకారాలు.. శవాల దిబ్బలను తలపిస్తున్నాయి అక్కడ పరిస్థితులు. సోషల్‌ మీడియాలో ఎటు చూసినా భూకంపాలకు సంబంధించిన దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఆపదలో ఉన్న సమయంలో తాము ఉన్నామంటూ అనేక మంది.. మేము సైతం అంటూ.. తమవంతుగా సహాయక చర్యల్లో స్థానికులు సైతం పాల్గొని.. ఎందరినో కాపాడుతున్నారు. ఈ క్రమంలో సిరియా అలెప్పోలో ఓ తల్లి బిడ్డను ప్రసవించింది. అదీ శిథిలాల కిందే.. తల్లి ఓ పండంటి బిడ్డను ప్రసవించింది. అయితే దురదృష్టం కొద్దీ ప్రసవించిన వెంటనే చిన్నారిని కనులారా చూడక ముందే ఆ తల్లి కన్నుమూసింది. శిథిలాల తొలగింపు క్రమంలో ఇది గమనించిన స్థానికులు.. ఆ బిడ్డను హుటాహుటిన వైద్యం కోసం తరలించారు. ప్రస్తుతం ఆ బిడ్డ పరిస్థితి నిలకబడగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ పసి బిడ్డకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది.

ఓవైపు బిడ్డకు ప్రాణం పోసిన దేవుడు .. తల్లి ప్రాణం తీశాడు అంటూ క్యాప్షన్ తో సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. అంతేకాదు దేవుడు సిరియా, టర్కీ ప్రజలకు సహనాన్ని ప్రసాదిస్తాడు. భూకంప బాధితులను కరుణించి అండగా నిలబడతాడు అని ఆశాభావం వ్యక్తం చేశారు. 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..