AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్‌లో ఊహించని కొత్త యాంగిల్.. స్టాఫ్ కు నజరానా!

అమెరికా అధ్యకుడు ట్రంప్ అంటేనే ఇరాన్ పై దాడులు, వలసదారులపై కఠినత్వం. సుంకాలతో దేశాలను భయపెట్టడం గుర్తుకొస్తాయి.  గ్లోబల్ మార్కెట్‌ను టెన్షన్ పెట్టే  ట్రంప్ లో అసలు ఆ యాంగిల్ ఏంటి అనుకునేలా తాజాగా ఓ మంచి పని చేసి అందరికీ షాక్ ఇచ్చారు. వైట్‌హౌస్‌లో తన కింద పనిచేసే నలుగురికి  హాలిడే ట్రిప్ కోసం గట్టిగానే క్యాష్ గిఫ్ట్స్ ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు.

ట్రంప్‌లో ఊహించని కొత్త యాంగిల్.. స్టాఫ్ కు నజరానా!
Trump Holiday Gifts To White House Staff
Sharada V
|

Updated on: Sep 09, 2026 | 6:44 PM

Share

ఎప్పుడూ తిట్టించుకునే ట్రంప్, ఈసారి మాత్రం తనలోని సాఫ్ట్ కార్నర్ ను చూపించి “మా వాళ్లను నేను చూసుకుంటా” అన్నట్టుగా గిఫ్ట్ లు ఇచ్చి నెటిజన్లతో వావ్ అనిపించుకుంటున్నారు. అందరినీ భయపెట్టే ట్రంప్ ఒక్కసారిగా ఓపెన్ అయిపోయి తన టీమ్‌కి అదిరిపోయే రేంజ్‌లో గిఫ్ట్‌లు ఇచ్చారు. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ నటాలీ హార్ప్‌కు ట్రంప్  ఏకంగా 45,000 డాలర్ల క్యాష్ గిఫ్ట్‌ను అందచేసారు.  వైట్‌హౌస్‌లో పనిచేస్తున్న మరో ఇద్దరు స్టాఫ్ మెంబర్స్ మార్గో మార్టిన్, ఛాంబర్‌లేన్ హారిస్‌లకు కూడా దాదాపు అదే రేంజ్‌లో భారీ అమౌంట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారట.

హాలిడే ట్రిప్ కోసం

ఆ ముగ్గురు లేడీస్ హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేయడానికి ట్రంప్ ఈ గిఫ్ట్ ప్యాకేజ్ ఇప్పించారని ఆ కథనం రాసుకొచ్చింది. పని చేసేవాళ్లను పీకల్లోతు కష్టపెట్టడమే కాదు, ఓ రేంజ్‌లో చూసుకుంటారంటే ట్రంప్ సారు లెక్కే వేరు.

ట్రంప్ సెకండ్ టైమ్ పవర్‌లోకి వచ్చాక ఆయన పక్కనే ఉంటూ, సోషల్ మీడియా పోస్టులు టైప్ చేయడం, పేపర్లు ప్రింట్ తీయడం లాంటి పనులు చేస్తూ ఆయనకు నీడలా మారిపోయింది ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ నటాలీ హార్ప్. ఈ అంకితభావం చూసే వైట్‌హౌస్ వర్గాలు ముద్దుగా ఆమెను “హ్యూమన్ ప్రింటర్” అని పిలుస్తుంటారట.  ట్రంప్ దగ్గర అంత కష్టపడి పనిచేస్తున్నందుకు ఆమెకు హాలిడే ట్రిప్ కోసం ఏకంగా 45,000 డాలర్ల క్యాష్ గిఫ్ట్‌ను అందించారు.  ఎప్పుడూ తన వెంటే ఉంటూ ఏ చిన్న పని చెప్పినా పర్ఫెక్ట్‌గా చేసే ఇతన మహిళా స్టాఫ్‌కూ ట్రంప్ భారీగా ముట్టచెప్పారు. పని చేయించుకోవడంలోనే కాదు, నమ్మినవాళ్లను ట్రీట్ చేయడంలో కూడా ట్రంప్ స్టైలే వేరు!

ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లను పేల్చేసిన ట్రంప్ సేన! 

ఇదిలా ఉంటే అమెరికా, ఇరాన్ మధ్య అగ్గిరాజుకుంది.  అమెరికా నేవీ వార్‌షిప్ మీద ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (IRGC) ఏకంగా రెండుసార్లు బాలిస్టిక్ మిస్సైళ్లతో దాడికి తెగబడింది. ఈ అటాక్‌పై యూఎస్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్‌కు చెందిన ఏకంగా ఐదు ముడి చమురు రవాణా నౌకలను యూఎస్ సెంట్రల్ కమాండ్ తునాతునకలు చేసింది. మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఎప్పుడు ఏ క్షణంలో ఎటు మారుతాయో అనే టెన్షన్ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది!

Follow Us