Watch Video: ఆ దేశ అధ్యక్షుడిపై టమాటాలతో దాడి.. ఎందుకో తెలుసా..

ఆయన అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు. ఈ మధ్యే జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు. ఎదురు లేని నాయకుడిగా నిలిచాడు. పెద్ద ఎత్తున అతనికి ఆదేశ ప్రజానికం..

Watch Video: ఆ దేశ అధ్యక్షుడిపై టమాటాలతో దాడి.. ఎందుకో తెలుసా..
Emmanuel Macron

Updated on: Apr 28, 2022 | 1:54 PM

ఆయన అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు. ఈ మధ్యే జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు. ఎదురు లేని నాయకుడిగా నిలిచాడు. పెద్ద ఎత్తున అతనికి ఆదేశ ప్రజానికం వెన్నుతట్టి నిలిచారు. అతనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్(Emmanuel Macron). ఆయన రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. వరుసగా రెండోసారి ఎన్నికల్లో మాక్రాన్‌ అధ్యక్ష పీఠాన్ని దక్కించుకుకోవడం విశేషం. ఎన్నికల్లో మాక్రాన్‌కు 58 శాతం ఓట్లు రాగా, ప్రత్యర్థి మరీన్‌ లీపెన్‌కు 42 శాతం ఓట్లు పడ్డాయి. ఇదిలా ఉండగా ఎన్నికల ఫలితాల రోజునే ఆయన గెలుపును జీర్ణించుకోలేని వ్యతిరేకవాదులు మాక్రాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపై నిరసనలకు దిగారు.

తాజాగా జరిగిన ఘటన అందిరిని షాక్‌కు గురి చేసింది. మాక్రాన్‌ ఫ్రెంచ్‌ పట్టణంలోని ఓ ఫుడ్‌ మార్కెట్‌లో కొంత స్థానికులతో కలిసి మాట్లాడుతుండగా ఆయనపై నిరసనకారులు టమాటాలతో దాడి చేశారు. వెంటనే మాక్రాన్‌ భద్రతా సిబ్బంది అలర్ట్‌ అయారు. ‘ప్రొజెక్టల్‌’ అంటూ గట్టిగా అరుస్తూ ఆయనకు రక్షణగా నిలిచారు. దీంతో మాక్రాన్‌కు ఈ పర్యటన సందర్భంగా చేదు అనుభవం ఎదురైంది.

కాగా, అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా పాల్గొన్న మొదటి పబ్లిక్‌ మీట్‌లోనే ఇలా జరగడంతో మాక్రాన్‌ ఇబ్బందికి గురయ్యారు. ఈ ఘటన అనంతరం మాక్రాన్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో  ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి: Donald Trump: ట్రంప్‌ రోజూ 10 వేల డాలర్లు జరిమానా కట్టాలటా.. ఎందుకో తెలుసా?

Andhra vs Odisha: ఆంధ్రా- ఒడిశా బోర్డర్‌లో టెన్షన్‌.. కోడిగుడ్ల లారీల అడ్డగింత.. రైతుల ఆందోళన..!