చైనాలో విమానాశ్రయ విస్తరణ పనులు చేపట్టిన కార్మికులు.. తవ్వకాల్లో బయటపడ్డ వేలాది సమాధులు

|

Feb 19, 2021 | 7:42 PM

చైనాలో పునాదులు తవ్వుతుండగా, వేలకొద్ది సమాధులు బయటపడ్డాయి. దీంతో నిర్మాణ ప్రాంతం కాస్త.. పురావస్తు ప్రదర్శనశాలగా మారిపోయింది.

చైనాలో విమానాశ్రయ విస్తరణ పనులు చేపట్టిన కార్మికులు.. తవ్వకాల్లో బయటపడ్డ వేలాది సమాధులు
Follow us on

Thousands of tombs found in China : చైనాలో మరోసారి పురాతన ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి తాజాగా షాన్సీ ప్రావిన్స్‌లో ఎయిర్‌పోర్టును విస్తరణ పనులు చేపట్టింది. ఇందులో భాగంగా పునాదులు తవ్వుతుండగా, వేలకొద్ది సమాధులు బయటపడ్డాయి. దీంతో నిర్మాణ ప్రాంతం కాస్త.. పురావస్తు ప్రదర్శనశాలగా మారిపోయింది.

షాన్సీ ప్రావిన్స్‌ రాజధాని గ్జియాన్‌లో గ్జియాన్‌యాంగ్‌ ఎయిర్‌పోర్టును విస్తరించేందుకు ఆ దేశ ప్రభుత్వం ఫ్లాన్ చేసింది. ఇటీవలే ఈ ఎయిర్‌పోర్టు విస్తరణ పనులను ప్రారంభించారు. నిర్మాణంలో భాగంగా భూమిని తొవ్వుతుండగా.. సమాధులు బయటపడటం అందరిని షాక్‌కు గురిచేసింది. దీంతో నిర్మాణ కార్మికులను పక్కన పెట్టి.. పురావస్తుశాఖ అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగారు. చైనా నూతన సంవత్సర వేడుకల కోసం పెట్టిన సెలవులు సైతం వదులుకొని ఎయిర్‌పోర్టు ప్రాంతంలో పురావస్తు శాఖ తవ్వకాల్లో నిమగ్నమైంది.

ఇక, ఇప్పటివరకు 4,600 పురాతన వస్తువులను వెలికితీయగా.. వాటిలో 3,500 సమాధులు ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ సమాధులు చరిత్రలో వేర్వేరు కాలాల్లో.. వేర్వేరు రాజ్యాలకు సంబంధించిన వారివిగా పురావస్తుశాఖ నిపుణులు భావిస్తున్నారు. గ్జియాన్ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన నాలుగు రాజధానుల్లో ఒకటని చైనా స్టేట్‌ కౌన్సిల్‌ వెల్లడించింది. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక అంశాలకు 1,100 ఏళ్లపాటు గ్జియాన్‌ రాజధానిగా ఉందని నిపుణులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి…  ప్రయాణికుల రాకపోకలపై అంక్షలు ఎత్తివేసిన కువైట్.. ఆ నిబంధనలు పాటించిన వారికి మాత్రమే అనుమతి..!