Supersonic Aircraft: చాలాకాలంగా ప్రపపంచంలోనే అత్యంత వేగవంతమైన విమానాన్ని వినియోగంలోకి తేవాలని అనేక దేశాలు పోటీపడుతున్నాయి. ఈ హైస్పీడ్ విమానాల కోసం అమెరికా (America), చైనా (China), ఫ్రాన్స్ (France), బ్రిటన్ వంటి దేశాలు ప్రయోగాలు కూడా చేస్తున్నాయి. అయితే, చైనా ఈ విషయంలో అందరికంటే ముందు ఉన్నట్టు ప్రకటించింది. చైనాకు చెందిన ఏరోస్పేస్ సంస్థ స్పేస్ ట్రాన్స్ పోర్టేషన్ హైస్పీడ్ విమానాన్ని తయారు చేసింది. ఆ సంస్థ ప్రకటించిన ప్రకారం చైనా రాజధాని బీజింగ్ నుంచి న్యూయార్క్ వరకు కేవలం గంట వ్యవధిలోనే ఈ విమానం ప్రయాణిస్తుందని, గంటకు 2600 కిమీ వేగంగా ప్రయాణిస్తుందని చైనా ప్రకటించింది.
జెట్ విమానాల కంటే ఆరురెట్ల వేగంగా ప్రయాణం చేస్తుందని, టీయాంక్సింగ్ 1, టియాంక్సింగ్ 2 గా పిలిచే ఈ సూపర్ సోనిక్ విమానాలను చైనా సంస్థ ఇప్పటికే విజయవంతంగా ప్రయోగించినట్టు తెలియజేసింది. అయితే, ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెల్లడించలేదు. 2024 నుంచి ఈ సూపర్‌సోనిక్ విమానాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చైనా ప్రయత్నాలు చేస్తుంది.
Also Read: కుటుంబ సమేతంగా మేడారం జాతరకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీ కోసం టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్
Largest Power Bank: ప్రపంచంలోనే అతి పెద్ద పవర్ బ్యాంక్.. ఒకేసారి 5 వేల ఫోన్లకు చార్జింగ్