Rishi Sunak: బ్రిటన్ నూతన ప్రధానిగా లిజ్ ట్రస్ ఎన్నికైన విషయం తెలిసిందే. భారత సంతతికి చెందిన రిషి సునక్ కూడా ప్రధాని రేసులో నిలిచిన విషయం విధితమే. ఒకానొక సమయంలో రిషి సునక్ విజయం సాధిస్తాడనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. అయితే హోరాహోరీ పోరులో రిషి సునాక్‌పై లిజ్ ట్రస్ గెలుపొందారు.. ఇదిలా ఉంటే రిషి ఇప్పుడు ఏం చేస్తారన్న ప్రశ్న అందరిలోనూ నెలకొంది.
సాధారణంగా నాయకత్వ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకు కేబినెట్‌లో కీలక పదవులు ఇవ్వడం యూకేలో సంప్రదాయంగా వస్తోంది.. అయితే ఈ సారి సునాక్‌ను తీసుకునే అవకాశాలు లేవని తెలుస్తోంది. కొత్త కేబినెట్‌లో సునాక్ మద్దతుదారులకు మంత్రి పదవులు దక్కనున్నట్లు అక్కడి మీడియా కథనాలు తెలిపాయి.. లిజ్ ట్రస్ చేతిలో ఓడిపోయిన తరువాత, సునక్ కన్జర్వేటివ్స్‌లో ఐక్యత కోసం పిలుపునిచ్చారు..కొత్త ప్రధాని ప్రభుత్వానికి తాను మద్దతిస్తానని, అయితే తాను మంత్రివర్గంలో ఉండే అవకాశం లేదని అన్నారు. మకి రిషికి కేబినెట్‌లో చోటు దక్కుతుందా లేదా అన్నది వేచి చూడాలి.
ఇదిలా ఉంటే ఓటమి అనంతరం రిషి మాట్లాడుతూ.. ఎంపీగా కొనసాగుతూ, తన నియోజకవర్గం కోసం పనిచేస్తానని తెలిపారు. ఉత్తర యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్‌కు ప్రాతినిధ్యం వహించడం గొప్పగా భావిస్తున్నా అని.. ప్రజల మద్దతు ఉన్నంతకాలం వారికి అందుబాటులోనే ఉంటానంటూ చెప్పుకొచ్చారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..