AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: తల చుట్టూ కొడవలి.. ఎడమ పాదానికి తాళం.. ఆసక్తి రేపుతున్న యువతి అస్థిపంజరం

జాంబీరెడ్డి సినిమా చూశారా.. ఆ సినిమాలో జాంబీస్ ఎవరినైనా కొరికితే వారు కూడా జాంబీలుగా మారిపోతారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. గతంలో పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. ఆర్కియాలజీ..

Viral: తల చుట్టూ కొడవలి.. ఎడమ పాదానికి తాళం.. ఆసక్తి రేపుతున్న యువతి అస్థిపంజరం
Vampire
Ganesh Mudavath
|

Updated on: Sep 10, 2022 | 7:42 PM

Share

జాంబీరెడ్డి సినిమా చూశారా.. ఆ సినిమాలో జాంబీస్ ఎవరినైనా కొరికితే వారు కూడా జాంబీలుగా మారిపోతారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. గతంలో పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. ఆర్కియాలజీ శాస్త్రవేత్తలు చేపట్టే అధ్యయనంలో పూర్వకాలానికి సంబంధించిన ఎన్నో సమాధులు వెలువడ్డాయి. వీటిలో చాలా వరకు అంతులేని ప్రశ్నగా మిగిలిపోతే.. మరికొన్ని మాత్రం తీవ్ర ఉత్కంఠ రేకెత్తించాయి. ప్రస్తుతం అలాంటి అస్థిపంజరం (Skeleton) ఒకటి అధ్యయన బృందానికి లభ్యమైంది. ఆ స్కెలిటన్ ను చూస్తుంటే అప్పటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో.. అంధ విశ్వాసాలతో వారు ఎంత దారుణంగా ప్రవర్తించారో అర్థమవుతోంది. యూరప్‌ దేశం పోలాండ్‌లో ఓ అస్థి పంజరం లభ్యమైంది. టోరన్ (Toran) లోని నికోలస్ కోపర్నికస్ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజీ బృందం చేపట్టిన పరిశోధనలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒస్ట్రోమెక్కో పరిధిలోని పెయిన్‌ అనే గ్రామంలోని స్మశాన వాటిక ప్రదేశంలో యువతి అస్థిపంజరాన్ని గుర్తించారు. ఇది 17 వ శతాబ్దానికి చెందినదిగా నిర్ధారించారు. స్కెలిటన్ మెడ చుట్టు కొడవలి చుట్టి, ఎడమ పాదం బొటన వేలుకు తాళం వేసి ఉంది.

కోరల్లాంటి పళ్లతో రక్తం పీల్చి బతికే పిశాచాలను వ్యాంపైర్‌ అని పిలుస్తారు. రాత్రి పూట మాత్రమే సంచరిస్తూ వేటాడుతుంది. జోంబీస్ లాగే వ్యాంపైర్లు కూడా కొరికితే వాటిలా మారిపోతారని కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. 17వ శతాబ్దంలో పాశ్చాత్య దేశాల్లో మూఢ నమ్మకాలు అధికంగా ఉండేవి. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే యువతిని వ్యాంపైర్ గా భావించి, దారుణంగా హత్య చేసి పూడ్చి పెట్టి ఉంటారని పరిశోధకులు భావిస్తున్నారు. సమాధి నుంచి లేచి వస్తుందోననే భయంతో మెడలో కొడవలిని అలాగే ఉంచినట్లు తెలుసుకున్నారు. బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తే తల తెగిపోయేలా ఈ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఆమె నడవకుడా పాదానికి తాళం కూడా వేశారు. ఈ పరిస్థితులు రోజుల్లో మూఢనమ్మకాలు ఎలా ఉండేవనే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయని పరిశోధక బృందం సభ్యులు వివరించారు. దీనిపై తాము మరింత ముందుకు వెళ్తానని, నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తామని ప్రొఫెసర్‌ డారియుస్జ్‌ పోలిన్‌స్కి చెబుతున్నారు.

గతంలో యూరప్‌ లోని తూర్పు ప్రాంతంలో ఈ తరహా సమాధులు చాలానే బయట పడ్డాయి. వాటిలో చాలా వరకు ఈ తరహాలోనే పాతిపెట్టబడినవే. కానీ వాటి తలలు, కాళ్లు చేతులు, తల తిప్పేసి ఉండడం, లేదంటే తల పూర్తిగా ధ్వంసమై ఉన్నాయి. అయితే..ఈ అస్థికలు బయటపడడం మాత్రం ఒకింత కుతూహలం, మరోవైపు ఉత్కంఠ రేపుతోంది.

ఇవి కూడా చదవండి
Vampire Skeleton

Vampire Skeleton

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి