ఏం స్కెచ్ ఏశావు మహాతల్లీ.. బ్యాంకును దోచేసి తప్పించుకునేందుకు పుష్పరాజ్‌ను మించిపోయింది..
ప్రస్తుత రోజుల్లో నేరాలు యథేచ్ఛగా పెరిగిపోతున్నాయి. డబ్బుల కోసం ఎంతటికైనా తెగిస్తున్నారు. క్రైమ్ చేయడంలోనూ రోజుకో సిస్టమ్ ను ఫాలో అవుతున్నారు. అంతకు ముందు ఎవరూ చేయని విధంగా నేరాలకు తెగబడుతున్నారు. తాజాగా...
ప్రస్తుత రోజుల్లో నేరాలు యథేచ్ఛగా పెరిగిపోతున్నాయి. డబ్బుల కోసం ఎంతటికైనా తెగిస్తున్నారు. క్రైమ్ చేయడంలోనూ రోజుకో సిస్టమ్ ను ఫాలో అవుతున్నారు. అంతకు ముందు ఎవరూ చేయని విధంగా నేరాలకు తెగబడుతున్నారు. తాజాగా ఓ కిలాడీ లేడి ఖతర్నాక్ స్కెచ్ ఏసింది. బ్యాంకులో కావలసినంత దోచుకుని సినీ ఫక్కీలో పరారైంది. ముసుగు వేసుకొని నన్నెవరూ చూడట్లేదనుకుంది కానీ.. ఆ ముసుగు తొలగించే ఓ రోజొస్తుందని తెలుసుకోలేకపోయింది. అసలు ఈ ముసుగు దొంగ కథాకమామీషు ఏంటంటే.. చైనాలో యెకింగ్ నగరంలోని చైనా కన్ స్ట్రక్షన్ బ్యాంకులో చెన్ వైల్ అనే మహిళ క్లర్కుగా పనిచేసేది. ఈ క్రమంలో బ్యాంకు గుట్టుమట్లన్నీ తెలుసుకుంది. టెక్నాలజీ లోపాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది. అదను చూసి తన ఎకౌంట్‌లో లేని సొమ్మును ఉన్నట్టుగా క్రియేట్ చేసింది. తన ఖాతాలో పెద్దమొత్తంలో డబ్బు జమ అయినట్టుగా ఎడిట్ చేసింది. ఆ తర్వాత తన ఎకౌంట్ నుంచి అవసరమైన డబ్బు డ్రా చేసింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లి ప్లాస్టిక్ సర్జరీతో తన ముఖాన్ని మార్చేసుకుంది.
విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఇది సరికాదని మందలించారు. అయినా ఆమె వినలేదు. మేడమ్ మకాం మార్చేసింది. అక్కడ పేరు మార్చుకుని కొత్తరూపం, కొత్తపేరుతో చలామణీ అయ్యింది. వ్యాపారవేత్తగా ఎదిగింది. అంతేకాదు ఇదివరకే తనకు వివాహం అయినప్పటికీ ఆ విషయాన్ని దాచిపెట్టి కొత్త రూపంతో మరో పెళ్లి చేసుకుంది. ఓ అమ్మాయికి జన్మనిచ్చింది కూడా. సినిమాకు ఏమాత్రం తీసిపోని ఈ క్రైమ్ సీన్ 25 ఏళ్ల క్రితం అంటే 1997లో జరిగింది.
అప్పటి నుంచి ఈ కిలాడీ కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. ఎట్టకేలకు ముసుగు తొలగించారు. ప్లాస్టిక్ సర్జరీ వెనుక అసలు రూపాన్ని గుర్తించారు. పలు కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
మరిన్ని వైరల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..