FortNox Mystery: 4,580 టన్నుల బంగారం ఉందా పోయిందా?.. అమెరికా గొంతుపై కత్తి పెట్టిన మస్క్

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేసిన తాజా పోస్ట్ అమెరికా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. అమెరికా గోల్డ్ రిజర్వులపై టెస్లా అధినేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఫోర్ట్ నాక్స్ లో ఇప్పటికీ బంగారం నిల్వలు ఉన్నాయా? లేక దొంగిలించబడ్డాయా? అనే సందేహాన్ని మస్క్ వ్యక్తం చేశాడు. దీనికి పలువురు అమెరికా సెనెటర్లు కూడా వంత పాడటంతో అసలింతకీ ఫోర్ట్ నాక్స్ లో ఏం జరుగుతోందనే సందేహం అక్కడి పౌరుల్లో మెల్లి మెల్లిగా వేళ్లూనుకుంటోంది. అసలింతకీ ఫోర్డ్ నాక్స్ అంటే ఏంటి? అందులో ఉన్న రహస్యమేంటి అనే విషయాలు పరిశీలిస్తే..

FortNox Mystery: 4,580 టన్నుల బంగారం ఉందా పోయిందా?.. అమెరికా గొంతుపై కత్తి పెట్టిన మస్క్
Musk Fortnox Mystery

Updated on: Feb 19, 2025 | 10:17 PM

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4,580 టన్నుల బంగారాన్ని అమెరికా ప్రభుత్వం ఈ ఫోర్డ నాక్స్ అనే ప్రదేశంలో ఎన్నో ఏండ్లుగా నిల్వచేస్తూ వస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక బంగారం నిల్వలు ఉన్న దేశంగా యూఎస్ పేరుగాంచింది. అయితే, ఈ బంగారమంతా ఇప్పటికీ ఉందా? లేక మిస్సయిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటినుంచో ఈ విషయంపై పలు వాదనలు వినిపిస్తున్నప్పటికీ మస్క్ దీనిపై స్పందించడంతో మరోసారి ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది. ఒకవేళ ఈ విషయం మరింత ముదిరితే అమెరికా ప్రజలు అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి చేసే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్య ఉండే ఫోర్డ్ నాక్స్ ప్రదేశాన్ని ఎవ్వరూ విజిట్ చేయడానికి అనుమతులు లేవు. దీనిపై యూఎస్ సెనెటర్ మైక్ లీ కూడా గళం విప్పాడు. సెనెటర్ అయిన తనను కూడా అక్కడకు వెళ్లకుండా చాలా సార్లు అడ్డుకున్నారు. నాకు అనుమతులు ఇవ్వలేదు అంటూ చెప్పడంతో మస్క్ సందేహాలకు మరింత బలం చేకూరింది.

ఫోర్ట్ నాక్స్ అంటే ఏంటి?

అమెరికా తన వద్ద భారీగా ఉన్న బంగారం నిల్వలను స్టోర్ చేసుకునేందుకు ఏర్పాటు చేసిందే ఫోర్డ్ నాక్స్. కెంటకీ అనే ప్రదేశంలో ఉన్న ఈ స్టోరేజ్ లో ఇప్పుడు కాదు 1937 నుంచీ బంగారాన్ని అమెరికా నిల్వచేసుకుంటోంది. ఇదొక్కటే కాదు… యూఎస్ మింట్, డెన్వర్ మింట్, ఫెడరల్ రిజర్వ్ వాల్ట్ లోనూ పెద్ద మొత్తంలో అమెరికాకు చెందిన బంగారం రిజర్వులున్నాయి. ఫోర్డ్ నాక్స్ ను ఇప్పటి వరకూ నేరుగా చూసింది. లేదు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా ఆన్ లైన్లో కనిపించవు. నిరంతరం టైట్ సెక్యూరిటీ మధ్య ఉంటుంది. ఇందులోకి ఎవ్వరినీ అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

బంగారం వివాదం ఎలా మొదలైంది?

కాన్స్‌పిరసీ థియరిస్ట్‌ అలెక్స్ జోన్స్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్టుకు ఎలన్ మస్క్ స్పందించడంతో అసలు చర్చ మొదలైంది. ఫోర్డ్ నాక్స్ ను లైవ్ వీడియో తీస్తూ చూసి రావడం ఎంత బాగుంటుంది అని అతడు పోస్ట్ చేయగా మస్క్ దానికి కామెంట్ చేశాడు. ఇంతకీ అక్కడ బంగారం నిల్వలు ఉన్నాయని ఎవరన్నారు. అవి అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు. లేదా దొంగిలించబడొచ్చు. ఏదేమైనా ఆ బంగారమంతా అమెరికన్లదే. ఇప్పటికీ అది అక్కడ ఉందా అని మేం తెలుసుకోవాలనుకుంటున్నాం అని మస్క్ తన మనసులో మాట చెప్పాడు. దీంతో గోల్డ్ ఆడిట్ పై అమెరికాలో చర్చ జరుగుతోంది.

అమెరికాకు ఫోర్ట్ నాక్స్ ఎందుకంత కీలకం..

ఫోర్ట్ నాక్స్‌లో ప్రస్తుతం 147 మిలియన్ ట్రాయ్ ఔన్సుల బంగారం ఉందని అధికారికి గణాంకాలు చెప్తున్నాయి. అందుకే యూఎస్‌లో మరే ఇతర ప్రదేశాలకు లేని టఫ్ విజిటర్స్ పాలసీ ఇక్కడ ఉంటుంది. ఇది దేశంలో అత్యంత సురక్షితమైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. బంగారంతో పాటు, ముఖ్యమైన యూఎస్‌ డాక్యుమెంట్‌లను నిల్వ చేయడానికి ఫోర్ట్ నాక్స్ ఉపయోగిస్తారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో, ఫోర్ట్ నాక్స్‌లో రాజ్యాంగం, స్వాతంత్ర్య ప్రకటన వంటి చారిత్రక డాక్యుమెంట్స్ ఇక్కడే భద్రపరిచారు. అవి వాషింగ్టన్ డీసీకి తిరిగి వచ్చినప్పటికీ, గోల్డ్ రిజర్వ్స్ మాత్రం సీక్రెట్‌గానే ఉన్నాయి.