టెక్సాస్‌ సైకోల కాల్పుల్లో తెలుగు అమ్మాయి ఐశ్వర్య మృతి..

|

May 08, 2023 | 8:08 AM

ఏం జరుగుతుందో అర్థం అయ్యేలోపే ఇంత బీభత్సం జరిగిపోయిందంటున్నారు. టెక్సాస్‌ అనేది తెలుగువాళ్లు అధికంగా ఉండే ప్రాతం. ఇక్కడ రెండు లక్షల జనాభా ఉంటే దాదాపు సగం మంది తెలుగువారే. ఇలాంటి ప్రాంతంలో కాల్పులు జరపడంతో టెన్షన్‌ నెలకొంది.

టెక్సాస్‌ సైకోల కాల్పుల్లో తెలుగు అమ్మాయి ఐశ్వర్య మృతి..
Texas Mall
Follow us on

మే6 ఆదివారం రాత్రి అమెరికా కాల్పులతో దద్దరిల్లింది. టెక్సాస్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో ఇద్దరు సైకోలు వీరంగం సృష్టించారు.. సడన్‌గా మాల్‌లోకి చొరబడిన ఇద్దరూ అక్కడ ఉన్న వాళ్లపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఉత్తర డల్లాస్‌కి 40 కిలోమీటర్ల దూరంలోని స్ప్రాలింగ్ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. వారిలో రంగారెడ్డి జిల్లాకు చెందిన 27 సంవత్సరాల తాటికొండ ఐశ్వర్య ఉన్నారు. చనిపోయిన ఆ తొమ్మిదిమందిలో తాటికొండ ఐశ్వర్య ఒకరుగా తెలిసింది. ఐశ్వర్య రంగారెడ్డి జిల్లా జడ్జి నర్సిరెడ్డి కుమార్తె అని సమాచారం. కాల్పుల్లోనే ఐశ్వర్య మరణించినట్లు FBI నిర్థారించింది. కాల్పుల తర్వాత షాపింగ్ మాల్‌లోని కస్టమర్లు, ఉద్యోగులూ.. పార్కింగ్ లాట్స్‌లోకి పరుగులు తీశారు. మిలిటరీ దుస్తులు ధరించిన ఓ దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు.

ఒక్కసారిగా ఎదురైన ఈ హింసాత్మక కాల్పులతో వందలాది మంది మాల్ నుంచి భయాందోళనతో బయటకు పరుగులు పెట్టారు. తనకు కొంచెం దూరంలో ఆగి ఉన్న కారులోంచి ఒక్కసారిగా ఫైరింగ్‌ స్టార్ట్ అయ్యిందని ప్రత్యక్ష సాక్షి శిల్ప చెబుతున్నారు. ఏం జరుగుతుందో అర్థం అయ్యేలోపే ఇంత బీభత్సం జరిగిపోయిందంటున్నారు. టెక్సాస్‌ అనేది తెలుగువాళ్లు అధికంగా ఉండే ప్రాతం. ఇక్కడ రెండు లక్షల జనాభా ఉంటే దాదాపు సగం మంది తెలుగువారే. ఇలాంటి ప్రాంతంలో కాల్పులు జరపడంతో టెన్షన్‌ నెలకొంది.

అటు టెక్సాస్ సమీపంలోని ఫ్రిస్కన్‌ ప్రాంతంలో కూడా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. పలువురికి గాయాలు అయ్యాయి. ఒకే రోజు రెండు కాల్పుల ఘటనతో అక్కడి ప్రజలు భయం..భయంగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..