TikTok Star: అయ్యో ఎంత ఘోరం.. లేడీ టిక్‌టాక్ స్టార్ దారుణ హత్య..! అసలేం జరిగిందంటే..

పాకిస్థాన్ లో 17 ఏళ్ల లేడీ టిక్‌టాక్ స్టార్ సానా యూసుఫ్‌ సోమవారం (జూన్‌ 2) దారుణ హత్యకు గురైంది. సనా యూసుఫ్‌ను ఇస్లామాబాద్‌లోని త‌న ఇంట్లోనే గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పోలీసులు దీన్ని ప‌రువు హ‌త్యగా భావిస్తున్నారు. పాకిస్తాన్ బ్రాడ్‌కాస్ట్‌ సమా టీవీ ప్రకారం..

TikTok Star: అయ్యో ఎంత ఘోరం.. లేడీ టిక్‌టాక్ స్టార్ దారుణ హత్య..! అసలేం జరిగిందంటే..
Tiktok Star Sana Yousaf Murder Case

Updated on: Jun 03, 2025 | 8:11 PM

ఇస్లామాబాద్‌, జూన్‌ 3: పాకిస్తాన్‌లో దారుణం చోటు చేసుకుంది. 17 ఏళ్ల లేడీ టిక్‌టాక్ స్టార్ సానా యూసుఫ్‌ సోమవారం (జూన్‌ 2) దారుణ హత్యకు గురైంది. సానా యూసుఫ్‌ను ఇస్లామాబాద్‌లోని త‌న ఇంట్లోనే గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పోలీసులు దీన్ని ప‌రువు హ‌త్యగా భావిస్తున్నారు. పాకిస్తాన్ బ్రాడ్‌కాస్ట్‌ సమా టీవీ ప్రకారం.. కల్చర్, లైఫ్‌స్టైల్, యువత సాధికారతపై 17 ఏళ్ల సానా యూసుఫ్‌ తరచూ టిక్‌టాక్‌లో వీడియోలు పెడుతూ ఉంటుంది. ఈ టీనేజ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ చేసే వీడియోలు తెగ వెరల్‌ అవుతున్నాయి. అయితే సోమవారం ఓ గుర్తు తెలియ‌ని వ్యక్తి ఆమె ఇంట్లోకి చొర‌బ‌డి తుపాకీతో షూట్ చేశాడు. అనంతరం దుండగుడు అక్కడి నుంచి ప‌రార్ అయ్యాడు.

సనా యూసఫ్ పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని చిత్రాల్ అనే ప్రాంతానికి చెందిన అమ్మాయి. టిక్‌టాక్ వీడియోల ద్వారా ఆమె చాలా పాపుల‌ర్ అయ్యింది. స్థానికగా సనా సామాజిక కార్యకర్తగా కూడా వ్యవహరిస్తుంది. మహిళా హక్కులు, సంస్కృతి, విద్యా వంటి విషయాలపై తరచూ వీడియోలు చిత్రీకరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా యువత కోసం గట్టి గొంతుక వినిపించింది. దీంతో సనా వీడియోలు నెట్టింట తెగ పాపులర్‌ అయ్యాయి. ఇన్‌స్టాలో ఆమెకు 5 లక్షలకుపైగా ఫాలోవర్ల ఉన్నారు. సనా ప్రస్తుతం మెడిసిన్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతుంది. చూసేందుకు సనా పాక్‌ నటి హనియా ఆమిర్‌ను పోలి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అయితే సోమవారం ఇస్లామాబాద్‌లోని సెక్టార్ జీ13లోని సనా ఇంటికి అతిథిగా వచ్చిన వ్యక్తి బయట కొద్దిసేపు ఆమెతో మాట్లాడి ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లారు. అక్కడే అతడు గన్‌తో కాల్పులకు పాల్పడ్డాడు. దీనిపై అక్కడి పోలీసులు విచారణ చేపట్టారు. నిండితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.