చైనా పెట్టుబడులపైనే బంగ్లాదేశ్ కన్ను! తీస్తా తర్వాత మోంగ్లా పోర్టును చైనాకు అప్పగింత !

తీస్తా నది ప్రాజెక్టు వివాదం మరువక ముందే, బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ చైనాతో మరో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇది భారతదేశానికి దౌత్యపరంగా, ఆర్థికంగా ఇబ్బంది కలిగించే అంశంగా మారవచ్చు అంటున్నారు విశ్లేషకులు. అంతకుముందు భారత్‌కు కేటాయించిన అత్యంత కీలకమైన మోంగ్లా ఓడరేవు (Mongla Port) ప్రాజెక్టులో బంగ్లాదేశ్ ఇప్పుడు చైనాతో చేతులు కలిపింది. చైనా రాజధాని బీజింగ్‌లో జూన్ 25న ఈ అవగాహన ఒప్పందం కుదిరింది.

చైనా పెట్టుబడులపైనే బంగ్లాదేశ్ కన్ను! తీస్తా తర్వాత మోంగ్లా పోర్టును చైనాకు అప్పగింత !
Tarique Rahman China Visit

Updated on: Jun 26, 2026 | 12:56 PM

తీస్తా నది ప్రాజెక్టు వివాదం మరువక ముందే, బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ చైనాతో మరో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇది భారతదేశానికి దౌత్యపరంగా, ఆర్థికంగా ఇబ్బంది కలిగించే అంశంగా మారవచ్చు అంటున్నారు విశ్లేషకులు. అంతకుముందు భారత్‌కు కేటాయించిన అత్యంత కీలకమైన మోంగ్లా ఓడరేవు (Mongla Port) ప్రాజెక్టులో బంగ్లాదేశ్ ఇప్పుడు చైనాతో చేతులు కలిపింది. చైనా రాజధాని బీజింగ్‌లో జూన్ 25న ఈ అవగాహన ఒప్పందం కుదిరింది.

భారత్‌కు కేటాయించిన భూమి చైనా పరం!

బాగేర్‌హాట్‌లోని మోంగ్లా పోర్ట్‌కు ఆనుకుని ఉన్న 110 ఎకరాల భూమిలో ‘చైనా-బంగ్లాదేశ్ మోంగ్లా పోర్ట్ ఎకనామిక్ జోన్’ అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం బంగ్లాదేశ్ ఎకనామిక్ జోన్ అథారిటీ, చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్‌తో ఒప్పందం చేసుకుంది. వాస్తవానికి భారత్-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఈ భూమిని మొదట భారత ఆర్థిక మండలి ఏర్పాటు కోసం కేటాయించారు. అయితే, నిర్దేశిత కాలపరిమితిలోగా పనులు ప్రారంభించలేదనే నెపంతో, మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం అక్టోబర్ 2025లోనే ఈ ప్రాజెక్టును రద్దు చేసింది. ఇప్పుడు ప్రధాని తారిఖ్ రెహమాన్ తన చైనా పర్యటనలో ఆ భూమిని చైనాకు అప్పగించడం గమనార్హం.

చైనా పెట్టుబడులపైనే బంగ్లా కన్ను!

ప్రస్తుతం బంగ్లాదేశ్ పూర్తిగా చైనా పెట్టుబడులను ఆకర్షించే వ్యూహంలో పడింది. ఇందులో భాగంగా మోంగ్లా పోర్టుతో పాటు, చట్టోగ్రామ్‌లోని అన్వారాలో ‘చైనీస్ ఆర్థిక, పారిశ్రామిక జోన్’ ఏర్పాటు కోసం చైనా రోడ్ అండ్ బ్రిడ్జ్ కార్పొరేషన్‌తో బంగ్లాదేశ్ మరో అభివృద్ధి ఒప్పందంపై సంతకం చేసింది.

తీస్తా ప్రాజెక్టులోనూ చైనా హస్తం!

ఇటీవలే భారత్ సరిహద్దుల్లోని కీలకమైన తీస్తా నది సమగ్ర నిర్వహణ ప్రాజెక్టును కూడా బంగ్లాదేశ్ చైనాకు అప్పగించింది. చైనా జలవనరుల శాఖ మంత్రి లీ గుయోయింగ్, ప్రధాని తారిక్ రెహమాన్‌ల సమావేశంలో ఈ నీటి నిర్వహణ ఒప్పందం ఖరారైంది. భారతదేశ భద్రతకు అత్యంత కీలకమైన మోంగ్లా పోర్టు, తీస్తా నది ప్రాజెక్టులలో చైనా జోక్యం పెరగడం, దక్షిణ ఆసియా భౌగోళిక రాజకీయాల్లో సరికొత్త అలజడికి దారితీస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us