ఆఫ్ఘానిస్తాన్ దళాలకు మద్దతుగా అమెరికా తమపై జరుపుతున్న వైమానిక దాడులను తాలిబన్లు ఖండించారు. ఇది ఉభయ పక్షాల మధ్య కుదిరిన ఒప్పందాల ఉల్లంఘన అని ఆరోపించారు. ఇందుకు తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఆఫ్ఘన్ సైనికులకు అమెరికా మద్దతునిస్తోందన్న విషయాన్ని వారు ధృవీకరిస్తూ..కాందహార్ లోను, హెల్మండ్ ప్రావిన్స్ లోను గురువారం రాత్రి అమెరికా వైమానిక దాడులు జరిపిందని, దీనివల్ల కొందరు పౌరులు,, తాలిబన్లు (ముజాహిదీన్లు) మరణించారని తెలిపారు. ఈ ‘అమానుష దాడులను’ ఇస్లామిక్ ఎమిరేట్స్ ఖండిస్తోందని, ఆఫ్ఘన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ సందర్భంలో కుదిరిన ఒప్పందాన్ని ఇది అతిక్రమించడమేనని ఆరోపించారు. వచ్చే 6 నెలల్లో భారీ ఆపరేషన్స్ చేపడతామని ఆప్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని హెచ్చరించారని, అయితే ఈ ఆరు నెలల కాలంలో కాబూల్ లోని మిలిటరీ స్థావరాల మీద తాము విరుచుకుపడే అవకాశం ఉందని తాలిబన్ల ప్రతినిధి జహీబుల్లా ముజాహిదీన్ ప్రకటించాడు. శత్రువులు యుద్ధం కోసం దిగితే తాము కూడా చూస్తూ ఊరుకోబోమన్నాడు.
లోగడ అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ఉన్నప్పుడు.. ఆఫ్ఘన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణపై దోహాలో తమకు, అమెరికాకు మధ్య ఓ అగ్రిమెంటు కుదిరిందని, దాన్ని ఆ దేశం అతిక్రమిస్తోందని, కానీ దీనివల్ల తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించాడు. అటు ఆఫ్ఘన్ లో తాలిబన్ల దూకుడును ఇండియా కూడా పరోక్షంగా ఖండిస్తోంది. ఇది ఆ దేశ ఆంతరంగిక వ్యవహారమేనని అంటూనే.. ఆఫ్ఘన్ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించవలసి ఉందని పేర్కొంది. అవసరమైతే తాము భారత సైన్యం సాయం కోరుతామని ఇండియాలో ఆఫ్ఘన్ రాయబారి ఇటీవల వ్యాఖ్యానించారు.
మరిన్ని ఇక్కడ చూడండి : News Watch: వాన కష్టం వరద నష్టం.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )
ఐదు కొమ్ములతో అరుదైన గొర్రె..!ఎందుకిలా..?యుగాంతానికి సంకేతమా..?:sheep has 5 horns Video.