Swiss Bank Leak: స్విస్ బ్యాంక్ లీక్ చేసిన డేటా ప్రకారం.. పాకిస్థాన్ మాజీ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ జనరల్ అక్తర్ అబ్దుర్ రెహమాన్ ఖాన్ పేరు స్విస్ బ్యాంకు ఖాతాదారుల పేర్ల జాబితాలో బయటపడింది. కీలక రాజకీయ నాయకులు, జనరల్స్ ఖాతాదారులుగా పేర్కొనబడిన బ్యాంకు ఖాతాల్లో ఈయన పేరు ఉండడం అందరినీ ఆకర్షిస్తోంది. ప్రపంచంలోని అతి పెద్ద ప్రైవేటు బ్యాంకు స్విస్ బ్యాంక్ నుంచి లీకైన సమాచారం ప్రకారం 600 మంది ఖాతాదారుల సమాచారం బయటకు వచ్చింది. వారి ఖాతాల్లో బిలియన్ల డాలర్ల సొమ్ము మూలుగుతోంది. ఈ సొమ్ము మెుత్తం పాకిస్థాన్ కు చెందిన 1400 మందికి చెందినదని న్యూస్ ఏజన్సీ ఏఎన్ ఐ కథనం ప్రకారం తెలుస్తోంది. స్విస్ బ్యాంకులో పాకిస్థానీలు కలిగి ఉన్న ఖాతాలు సగటున గరిష్ఠంగా.. 4.42 మిలియన్ స్విస్ ఫ్రాంక్‌లను కలిగి ఉన్నాయని ది న్యూస్ ఇంటర్నేషనల్ వార్తాపత్రిక నివేదించింది.
సోవియట్-ఆఫ్గన్ యుద్ధం (1979-89) సమయంలో ఆఫ్గనిస్తాన్‌లోని ముజాహిదీన్‌లకు అమెరికా, ఇతర దేశాల నుంచి అప్పటి మిలిటరీ అధికారిగా ఉన్న ఖాన్ బిలియన్ల డాలర్ల నగదుతో పాటు ఇతర సహాయాన్ని కూడా అందించినట్లు న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) నివేదికను ఉటంకిస్తూ డాన్ వార్తాపత్రిక ప్రచురించిన నివేదిక ప్రకారం, సౌదీ అరేబియా, అమెరికా అందించే నిధులు.. అమెరికన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (CIA) స్విస్ బ్యాంక్ ఖాతాలోకి మళ్లించబడ్డాయి. ఈ ప్రక్రియలో అంతిమంగా ఆ నిధులు పాకిస్థాన్ మాజీ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ జనరల్ అక్తర్ అబ్దుర్ రెహమాన్ ఖాన్ కు చేరేవని తెలుస్తోంది.
ఇవీ చదవండి..
IDFC Bank: తన వద్ద పనిచేస్తున్నవారికి కోట్ల విలువైన షేర్లను బహుకరించిన ఆ సీఈఓ.. ఇంతకీ విషయం ఏంటంటే..
EV Charging Stations: ఆ నగరాల్లో పెరిగిన ఎలక్ర్టిక్ వాహన ఛార్జింగ్ స్టేషన్లు.. అక్కడే ఎందుకంటే..