అమ్మో బాబోయ్.. ప్రేమలో పడండంటూ విద్యార్థులకు సెలవులిచ్చారు..ఎక్కడంటే

|

Apr 02, 2023 | 2:09 PM

విద్యాలయాలు పండుగలు ఉన్నప్పుడు విద్యార్థులకు సెలవులు ప్రకటించడం మాములే. కాని ఓ దేశంలో మాత్రం కొన్ని కళాశాలలు ఏకంగా ప్రేమలో పడండి అంటూ సెలవులు ఇవ్వడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అమ్మో బాబోయ్.. ప్రేమలో పడండంటూ విద్యార్థులకు సెలవులిచ్చారు..ఎక్కడంటే
Love
Follow us on

విద్యాలయాలు పండుగలు ఉన్నప్పుడు విద్యార్థులకు సెలవులు ప్రకటించడం మాములే. కాని ఓ దేశంలో మాత్రం కొన్ని కళాశాలలు ఏకంగా ప్రేమలో పడండి అంటూ సెలవులు ఇవ్వడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ ఇది ఎక్కడ అనుకుంటున్నారా. మన పక్క దేశం చైనాలోనే. ప్రస్తుతం చైనాలో జననాల రేటు పడిపోవడం అక్కడ ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే జననాల రేటు పెంచే దిశగా డ్రాగన్ అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే ఆ దేశంలోని సుమారు తొమ్మిది కళాశాలల్లో విద్యార్థులను ప్రేమలో పడండి అంటూ ఏప్రిల్ నెలలో వారం రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు సమాచారం.

ప్రకృతిని ఆస్వాదిస్తూ.. జీవితాన్ని ప్రేమించడం, ప్రేమను ఆస్వాదించడం నేర్చుకోనేలా విద్యార్థులను ప్రోత్సహిస్తోంది చైనా. అయిదే ఇది కూడా జనన రేటును పెంచేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం విశేషం. జనన రేటు పెంచాలని ప్రభుత్వానికి 20కి పైగా సిఫార్సులు వచ్చాయి. దీనిపై సమగ్ర ఆలోచన జరిపిన నిపుణులు..ఇదో ప్రయత్నంగా ఈ విధానాన్ని తీసుకొచ్చి అమలు చేశారు. 1980 నుంచి 2015 మధ్య వన్ చైల్డ్ పాలసీ చైనాను జనాభా రేటు వృద్ధిని తీవ్రంగా దెబ్బతీసింది. ఆ తర్వాత కరోనా రావడంతో ఒక్కసారిగా చైనాలో జననాల రేటు పడిపోయింది. జనాభాను పెంచేందుకు చైనా ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలకు పలు రాయితీలు ఇస్తామని చెబుతున్నా..ప్రజలు సానుకూలంగా స్పందించడం లేదు. అందుకే జనాభా తగ్గుదలకు అడ్డుకట్ట వేసేందుకు ఇలాంటి వినూత్న రీతిలో ప్రయత్నిస్తోంది డ్రాగన్.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేసింది..